న్యూ లుక్‌…ఇలా మారిందేంట‌బ్బా!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో అంద‌రూ హీరోలే క‌నిపిస్తారు. అలాంటిది మెగా కుటుంబం నుంచి ఓ హీరోయిన్ రావ‌డం విశేషం. …

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో అంద‌రూ హీరోలే క‌నిపిస్తారు. అలాంటిది మెగా కుటుంబం నుంచి ఓ హీరోయిన్ రావ‌డం విశేషం. 

ఇండ‌స్ట్రీలో హీరోయిన్‌గా ఇంకా నిల‌దొక్కోక ముందే ఆమె పెళ్లి పీట‌లెక్కారు. గుంటూరు మాజీ ఐజీ జె.ప్ర‌భాక‌ర్‌రావు త‌న‌యుడు వెంక‌ట చైత‌న్య‌తో నిహారిక ఏడ‌డుగులు న‌డిచారు.

చైత‌న్య‌తో వివాహ నిశ్చ‌యం అయిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా నిహారిక షేర్ చేసిన పోస్టులు వైర‌ల్ అయ్యాయి. పెళ్లి త‌ర్వాత ఇక చెప్పేదేముంది? ప‌్ర‌తిదీ ఓ వార్తే. ఇటీవ‌ల చ‌డీచ‌ప్పుడు చేయ‌ని నిహారిక‌… తాజాగా సోష‌ల్ మీడియా తెర‌పై కొత్త గెట‌ప్‌లో క‌నిపించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

హాలీడేస్‌లో భాగంగా ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌తో క‌లిసి పాండిచ్చేరి వెళ్లారామె. భ‌ర్త‌తో దిగిన ఫొటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారామె. ఇందులో నిహారిక పూర్తిగా హెయిర్ స్టైల్ మార్చి న్యూలుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. 

మెగా తార ఇలా మారిందేంటబ్బా అనుకునేలా నిహారిక క‌నిపించ‌డం విశేషం. పెళ్లి త‌ర్వాత కూడా ఆమె చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతుండ‌టం విశేషం. త్వ‌ర‌లో వెబ్ సిరీస్‌లో ఆమె ప్రేక్ష‌కుల్ని క‌నువిందు చేయ‌నున్నారు.