ముచ్చటపడిన కథ మూలనపడిపోయింది. బాబుగారు ఓడిపోవడం కాదు, జగన్ ప్రభుత్వం రావడంతో బాలయ్య చేద్దాం అనుకున్న కథను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. అదే బాబుగారి ప్రభుత్వం వచ్చి వుంటే ఈ పాటికి వైఎస్ రాజారెడ్డిగా, జగన్ లా జగపతిబాబు చేత డ్యూయల్ రోల్ చేయించి, తెగహంగామా చేసేవారు.
అయితే బాలయ్యతో సినిమా వదులుకోవడం నిర్మాత సి.కళ్యాణ్ కు ఇష్టంలేదు. అందుకే ఓ టీమ్ ను రంగంలోకి దింపారు. గతంలో ఓ కొత్త దర్ళకుడు చెప్పిన ఓ లైన్ ను డెవలప్ చేయించే పనిలో వున్నారు. అది పూర్తయితే, బాలయ్య ఓకె అంటే కే ఎస్ రవికుమార్ చేతిలో వుంచాలని ప్లాన్.
ఇంకోపక్క డైమండ్ రత్నం ఓ కథను వివి వినాయక్ కోసం రెడీ చేస్తున్నారు. అది కనుక ఓకె అయితే నిర్మాత సి. కళ్యాణ్ అయినా, దర్శకుడిగా వివి వినాయక్ వస్తారు. అంతవరకు బాలయ్య కాస్త ఖాళీనే.