సల్మాన్ ఖాన్ భారత్ మూడీ భారీ ఎత్తున విడుదల కాబోతోంది మరో మూడురోజుల్లో. ఈలోగా ఎలాగైనా సరే, కిందామీదా పడి సాహో సినిమా టీజర్ ను రెడీ చేయాలని యువి క్రియేషన్స్ సంస్థ తెగ కష్టపడుతోంది. యూనిట్ కీలక బాధ్యులు అంతా చెన్నయ్ లో కూర్చుని సినిమా వర్క్ పరుగెట్టిస్తున్నారు. ఒకవేళ అయిదుకు రెడీ కాకపోతే ఏడున భారత్ థియేటర్లలోనే విడుదల చేస్తారు. సినిమా విడుదల ఇంక నెల పదిహేను రోజుల్లో వుంది.
టీజర్ వర్క్ కూడా వుంది. ఈ పరిస్థితుల్లో పరుగులు పెడుతున్నారు. అన్నింటికి మించి సినిమాను నాలుగు భాషల్లో రెడీ చేయాలి. సెన్సారుకు అప్లయ్ చేయాలి. పబ్లిసిటీ చేయాలి. మార్కెటింగ్ చేయాలి. సవాలక్ష పనులు. అన్నీకలిపి నెల పదిహేను రోజుల్లోనే ఫినిష్ చేయాలి. నాలుగు భాషల్లో పబ్లిసిటీ అంటే ఆగస్టులో వున్న పదిహేను రోజులు దానికే సరిపోతుంది.
సినిమాకు నేపథ్య సంగీతం వ్యవహారం పెండింగ్ లో వుంది. గిబ్రాన్ తో చేయించే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బిగ్గీస్ అయితే బాగానే వుంటుంది కానీ టైమ్ తీసుకుంటారు. అంత టైమ్ లేదు. అందుకే గిబ్రాన్ తో కానిచ్చేయాలని అలోచనలు సాగుతున్నట్లు బోగట్టా.