ఈ మాటంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకంటే, రెవెన్యూ పరంగానైనా, క్రిటిక్స్ పరంగానైనా రీసెంట్ గా నితిన్ కెరీర్ లో భీష్మ సినిమానే బెస్ట్. రంగ్ దే సినిమాతో పోలిస్తే భీష్మ సినిమానే పెద్ద హిట్. కానీ బుల్లితెరపై మాత్రం భీష్మ సినిమాను దాటేసింది రంగ్ దే.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్ లో రీసెంట్ గా ప్రసారమైంది రంగ్ దే. ఈ సినిమాకు ఏకంగా 7.22 టీఆర్పీ రావడం విశేషం. నిజానికి ఈ సినిమాను టీవీలో ప్రసారం చేయడానికి ముందే జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కు పెట్టారు. థియేటర్లలో మిస్ అయినోళ్లంతా ఓటీటీలో చూసేశారు. అయినప్పటికీ టీవీలో దీనికి మంచి రేటింగ్ వచ్చింది.
ఇక నితిన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన భీష్మ సినిమాకు జెమినీ ఛానెల్ లో ప్రసారం చేస్తే, 6.65 రేటింగ్ మాత్రమే వచ్చింది. సో.. టీఆర్పీ పరంగా భీష్మ తో పోల్చి చూసుకుంటే రంగ్ దే సినిమాదే పైచేయి అన్నమాట. అలా టీవీల్లో బ్లాక్ బస్టర్ భీష్మ కంటే, యావరేజ్ గా ఆడిన రంగ్ దేకే ఎక్కువ మార్కులు పడ్డట్టయింది.
నితిన్-కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సినిమాను అటు కామెడీగా తీయకుండా, ఇటు ఎమోషనల్ గా హార్ట్ టచింగ్ గా కూడా తీయకుండా.. ఫార్ములా లెక్కల ప్రకారం నడపాలని చూశాడు దర్శకుడు. దీంతో నెరేషన్ లో సిన్సియారిటీ కనిపించలేదు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు. యూనిట్ లో ఉన్న ఆ నిరాశ, తాజా టీఆర్పీతో కాస్త తగ్గి ఉంటుంది.