ఎన్నికల ముందు, ఎన్నికల టైమ్ లో, ఇప్పుడు ఎన్నికల తరువాత కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ నేరుగా, సూటిగా, సుత్తిలేకుండా చంద్రబాబు మీద విరుచుకుపడుతూనే వస్తున్నారు. సరైన పాయింట్ లేవనెత్తి కార్నర్ చేస్తూనే వస్తున్నారు. సరైన పోస్ట్ లు వాట్సప్ లో, వాట్సప్ స్టేటస్ ల్లో ఆయన సంధిస్తూ వస్తున్నారు.
ఈరోజు నేరుగా ఆయన ఓ మాట అడిగారు. ఆంధ్రను అంత డెవలప్ చేసాను, ఇంత డెవలప్ చేసాను అంటారు కదా? ఆంధ్రలో అన్ని ఆసుపత్రులు వుండగా, తెలంగాణకు వచ్చి బాడీ చెకప్ చేయించుకోవడం ఏమిటీ? అని. అంతేకాదు, ఇదే పని జగన్ చేసివుంటే నిలదీసేవారు కదా? అంటూ తనే నిలదీసాడు.
నిజమేగా? ఆంధ్ర నిండా అడుగుకు ఓ ఆసుపత్రి వుంది. మరి అవన్నీ వదిలి బాబుగారు నేరుగా హైదరాబాద్ ఎందుకు వచ్చినట్లో? వాస్తవానిక ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చాలా ఫేమస్. ఆ రంగంలో దాన్ని మించింది లేదు. అందుకే బాబు ఆ ఆసుపత్రిని ఎంచుకుని వుంటారు.
కానీ పాపం, అన్నింటికీ రెడ్డి.. రెడ్డి యేనా అని జగన్ ను, ఆయన పార్టీని నేరుగానో, చాటుగానో నిలదీస్తుంటారు తెదేపా జనాలు. కానీ ఈ ఫేమస్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఇన్ స్టిట్యూట్, దాని చీఫ్ కూడా డాక్టర్ నాగేశ్వరరెడ్డి నే. ఏమైనా పృధ్వీ మాత్రం వైకాపా కోసం నేరుగా బాగా కష్టపడ్డాడు. ఫలితం దక్కుతుందేమో?