పాజిటివ్ పరిపాలన తరీకా ఇదీ!

నలభయ్యేళ్ళ అనుభవం, అద్భుతమైన పరిపాలన సామర్థ్యం, వ్యూహ నైపుణ్యం… ఇలా చంద్రబాబు నాయుడు తన గురించి తాను నానా అవాకులూ చెవాకులూ పేలుతుంటారు. ఆయన ఇంతగా గప్పాలు కొట్టుకుంటూ విభజన సమస్యల పరిష్కారం దిశగా…

నలభయ్యేళ్ళ అనుభవం, అద్భుతమైన పరిపాలన సామర్థ్యం, వ్యూహ నైపుణ్యం… ఇలా చంద్రబాబు నాయుడు తన గురించి తాను నానా అవాకులూ చెవాకులూ పేలుతుంటారు. ఆయన ఇంతగా గప్పాలు కొట్టుకుంటూ విభజన సమస్యల పరిష్కారం దిశగా ఈ ఐదేళ్లలో వేసిన ముందడుగు ఒకటి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండోరోజునే తన ముద్ర ఏమిటో చూపిస్తున్నారు. పాజిటివ్ దృక్పథంతో పరిపాలన సాగించడం ఎలాగో రుజువు చేస్తున్నారు.

గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందు సందర్భంగా జగన్ హైదరాబాద్ వెళ్లారు. గవర్నర్ సమక్షంలోనే కేసీఆర్ తో భేటీ అయ్యారు. 9, 10 షెడ్యూళ్లలో పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం, అస్తుల పంపకం వ్యవహారాలు వీరి నడుమ చర్చకు వచ్చాయని సమాచారం. చంద్రబాబు నాయుడు ఐదేళ్లు పరిపాలన సాగిస్తే ఇలాంటి ప్రయత్నం ఒకటి కూడా జరగలేదు. అలాగని కేసీఆర్ తో స్నేహానికి చంద్రబాబు ప్రయత్నాలు చేయలేదని అనడానికి వీల్లేదు. ఆయన మోచేతి నీళ్లు తాగుతూ టీడీపీని ఈ రాష్ట్రంలో బతికించుకోవాలని ఆయన చూసారు.

కేసీఆర్ ఖాతరు చేయక పోయేసరికి కాంగ్రెస్ ప్రాపకంలోకి వెళ్లారు. (ఈ విషయాలను ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు) రాజకీయ లబ్ది కోసం కేసీఆర్ ను ఆశ్రయించబోయారే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలతో ఏనాడూ పనిచేయలేదు. నిజానికి చంద్రబాబు సామర్థ్య లోపాలు జగన్ కు కలిసి వచ్చాయి. ఐదేళ్ల పెండింగ్ అంశాలపై ఆయన రెండు రోజుల్లోనే దృష్టి సారిస్తున్నారు. ఇవ్వాలో రేపో అవి ఒక కొలిక్కి వస్తాయి కూడా. అందుకే పాజిటివ్ పరిపాలన అంటే ఏమిటో జగన్ తన ముద్ర చూపిస్తున్నాడని పలువురు అనుకుంటున్నారు

పదేళ్ల నడక.. పోరాడి.. పోరాడి సాధించిన విజయం