సితారలో వెంకీ అట్లూరి

తొలిప్రేమ, మజ్ఞు సినిమాలతో తనకంటూ ఓ స్టయిల్ వుందని రుజువు చేసుకున్నారు వెంకీ అట్లూరి. మజ్ఞు తరువాత స్క్రిప్ట్ చేసుకుని మళ్లీ సినిమాకు రెడీ అయ్యారు. ఈసారి ఏ హీరోతో చేస్తారో? అన్నది ఇంకా…

తొలిప్రేమ, మజ్ఞు సినిమాలతో తనకంటూ ఓ స్టయిల్ వుందని రుజువు చేసుకున్నారు వెంకీ అట్లూరి. మజ్ఞు తరువాత స్క్రిప్ట్ చేసుకుని మళ్లీ సినిమాకు రెడీ అయ్యారు. ఈసారి ఏ హీరోతో చేస్తారో? అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమా చేసే అవకాశం వుందని తెలుస్తోంది. వెంకీ అట్లూరి తయారుచేసిన స్క్రిప్ట్ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓకె చేసింది.

అయితే ఏ హీరోకి అన్నది ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. సితార సంస్థ చాలా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తోంది. నానితో మరోటి, అలాగే నితిన్ తో భీష్మ కాకుండా ఇంకోటి, ఇలా చాలా వున్నాయి. మరి వెంకీ అట్లూరిని ఎవరి కాంబినేషన్ లోకి సెట్ చేస్తారో చూడాలి.

ఇదిలావుంటే వెంకీ అట్లూరి మైత్రీ మూవీస్ లో కూడా ఓ సినిమా చేయాల్సి వుంది. అయితే ప్రస్తుతం చాలా ప్రాజెక్టులతో మైత్రీమూవీస్ బిజీగా వుండడంతో, ముందుగా సితార సంస్థలో సినిమా చేసే ఆలోచనలు చేస్తున్నట్లు బోగట్టా.

పదేళ్ల నడక.. పోరాడి.. పోరాడి సాధించిన విజయం