నాగార్జున సినిమాలో నటించబోతున్నట్టు కాజల్ ఇప్పటికే ప్రకటించింది. నాగ్-కాజల్ కాంబినేషన్ లో రాబోతున్న ఫస్ట్ మూవీ ఇదే. నాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా కాజల్ చెప్పుకొచ్చింది. అయితే ఈ మూవీలో కాజల్ నటించడానికి కేవలం నాగ్ మాత్రమే కారణం కాదు, ఆమె క్యారెక్టర్ డిజైన్ అంత బాగుంటుందట.
అవును.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ హీరోగా రాబోతున్న సినిమాలో కాజల్ గూఢచారిగా కనిపించబోతోంది. కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర పోషించలేదు కాజల్. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంది.
సినిమాలో కాజల్ RAW (రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్) ఏజెంట్ గా కనిపించనుండగా.. నాగ్ ఎక్స్ రా-ఏజెంట్ గా కనిపిస్తాడు. నాగ్ కు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ కనిపించనుంది. ఇదొక కంప్లీట్ యాక్షన్ మూవీ అంటున్నాడు దర్శకుడు.
ఈ సినిమాలో రా-ఏజెంట్ గా కనిపించేందుకు ప్రత్యేకంగా ట్రయినింగ్ తీసుకోబోతోంది కాజల్. ఆయుధాలు ఎలా పట్టుకోవాలనే అంశంతో పాటు.. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ తో శిక్షణ తీసుకోబోతోంది. ఈ ట్రయినింగ్ పూర్తయిన వెంటనే నాగ్-ప్రవీణ్ సత్తారు మూవీ సెట్స్ పైకి షిఫ్ట్ అవుతుంది ఈ బ్యూటీ.