స్క్రిప్ట్ రైటర్ గా మారబోతున్న హీరోయిన్

లాక్ డౌన్ టైమ్ లో స్టోరీలైన్స్ రాసిన విషయాన్ని బయటపెట్టింది శృతిహాసన్. ఇప్పుడా కథల్ని, స్క్రీన్ ప్లే రూపంలోకి మార్చే పని మొదలుపెట్టింది. అవును.. శృతిహాసన్ ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ గా మరో కొత్త…

లాక్ డౌన్ టైమ్ లో స్టోరీలైన్స్ రాసిన విషయాన్ని బయటపెట్టింది శృతిహాసన్. ఇప్పుడా కథల్ని, స్క్రీన్ ప్లే రూపంలోకి మార్చే పని మొదలుపెట్టింది. అవును.. శృతిహాసన్ ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ గా మరో కొత్త అవతారం ఎత్తింది.

15 ఏళ్ల వయసు నుంచే కవితలు, పాటలు రాయడం శృతిహాసన్ కు అలవాటు. కానీ స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఆమెకు పూర్తిగా కొత్త. లాక్ డౌన్ టైమ్ ను దాని కోసం ఉపయోగించుకుంది. కొన్ని స్టోరీలైన్స్ రాసిపెట్టుకుంది. అలా రాసిపెట్టుకున్న స్టోరీలైన్స్ ను ఇప్పుడు స్క్రిప్ట్ రూపంలో మారుస్తున్నట్టు ప్రకటించింది శృతి.

ప్రస్తుతం వరుస సినిమాలతో హీరోయిన్ గా బిజీగా ఉంది శృతిహాసన్. ఇలా తీరికలేకుండా ఉన్నప్పటికీ.. స్క్రిప్ట్ రైటింగ్ తనకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తోందని చెబుతోంది. పాటలు, కథలు రాయడంలో కొన్నేళ్లుగా తన స్కిల్స్ ను మెరుగుపరుచుకుంటున్నానని… అదిప్పుడు బాగా ఉపయోగపడుతోందని చెప్పుకొచ్చింది శృతి.

మరి తను రాసిన స్క్రిప్ట్ తో తనే డైరక్షన్ చేస్తుందా లేక మరో దర్శకుడి చేతిలో తన స్క్రిప్ట్ పెట్టి తను నటిస్తుందా అనే విషయం త్వరలోనే తేలిపోతుంది.

'మోస‌గాళ్లు' మేకింగ్ వీడియో

నా రగ్డ్‌ లుక్‌ కోసం రెండు నెలలు కష్టపడ్డాను