భూ అక్రమార్కులకు సీరియస్ వార్నింగ్ ?

చూస్తూ ఊరుకుంటామనుకుంటే పొరపాటే. ఇక మీదట కఠినాతికఠినంగా వ్యవహరిస్తామంటూ వైసీపీ సర్కార్ పెద్దలు భూ కబ్జాదారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. కబ్జాలు చేసిన భూములు వెనక్కి ఇస్తే సరి, లేకపోతే సీరియస్ యాక్షన్ లోకి…

చూస్తూ ఊరుకుంటామనుకుంటే పొరపాటే. ఇక మీదట కఠినాతికఠినంగా వ్యవహరిస్తామంటూ వైసీపీ సర్కార్ పెద్దలు భూ కబ్జాదారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. కబ్జాలు చేసిన భూములు వెనక్కి ఇస్తే సరి, లేకపోతే సీరియస్ యాక్షన్ లోకి దిగిపోతామని కూడా హెచ్చరించారు.

విశాఖలో దాదాపుగా అయిదు వేల కోట్ల విలువ చేసే భూములను ఇప్పటిదాకా కైవశం చేసుకున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రకటించారు. 

ఇంకా చాలా భూములు కబ్జాకోరలలో చిక్కుకుని ఉన్నాయని వారు వెల్లడించారు. అలాంటి వారి భరతం పట్టి భూములను వెనక్కి తీసుకు వస్తామని వారు స్పష్టం చేయడంతో అక్రమార్కుల గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయి.

ఈ కుంభకోణాల్లో తప్పు చేసిన అధికారుల మీద కూడా యాక్షన్ ఉంటుందని పేర్కోనడం విశేషం. ఇక సింహాచలం దేవస్థానం భూముల రిజిష్టర్ నుంచి ఏకంగా 740 ఎకరాలు తొలగించి అన్యాక్రాంతం చేసినట్లుగా గుర్తించామని వారు తెలిపారు. 

దీని మీద ఇద్దరు జాయింట్ కలెక్టర్లలో విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మొత్తం మీద చూస్తే విశాఖ భూయాగమే వైసీపీ సర్కార్ చేస్తోంది. భూములను చుట్టుకుని ఉన్న ఎంతటి పెద్ద పాములైనా ఈ యాగంలో పడిపోవాల్సిందేనని అంటున్నారు.