ఏస్ డైరక్టర్ రాజమౌళి లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ ఇంకా సెట్ మీదే వుంది. కానీ ఈ లోగానే దర్శకుడు రాజమౌళి తరువాత సినిమా హడావుడి మెదలయింది.
సాధారణంగా రాజమౌళి సినిమాకు సినిమాకు మధ్య కాస్త ఎక్కువ గ్యాప్ నే తీసుకుంటారు. అసలు ఏం చేయాలి? ఏ రేంజ్ లో చేయాలి? అని ఆయన చాలా మధనపడుతుంటారు.
కానీ ఈసారి అంత గ్యాప్ తీసుకునే ఆలోచన లో వున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే తరువాత సినిమా మహేష్ బాబుతో అన్నది ఫిక్స్, అలాగే నిర్మాత కేఎల్ నారాయణతో అన్నది ఫిక్స్.
ఇప్పటికే ఈ మేరకు మీటింగ్ లు ప్రారంభమైపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత కేఎల్ నారాయణ పలుసార్లు రాజమౌళిని అలాగే మహేష్ బాబును కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది.
రాజమౌళి కూడా మహేష్ బాబును కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. తన ఆర్ఆర్ఆర్ సినిమా అప్ డేట్ అలాగే మహేష్ సినిమాల ప్లానింగ్ లు డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదంతా చూస్తుంటే ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి పెద్దగా గ్యాప్ తీసుకునే ఆలోచనలో వున్నట్లు లేదు. మహేష్ – తివిక్రమ్ సినిమా 2022 సమ్మర్ టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆ టైమ్ కు రాజమౌళి రెడీ అయిపోతారన్నమాట.