బిగ్ బాస్ అయిదుకు తెరవెనుక సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో బిగ్ బాస్ కు ఎవరు వస్తారా? అని వెదికేవారు. కానీ బిగ్ బాస్ నాలుగు తరువాత చిన్న చితక యాంకర్లంతా బిగ్ బాస్ వైపు చూస్తున్నారు. ఎవరికి వారు వారి వారి ప్రయత్నాలు తెగ చేస్తున్నట్లు బోగట్టా.
ఎప్పుడయితే అరియానా, అవినాష్ లాంటి వాళ్లు బిగ్ బాస్ కు వెళ్లి సెలబ్రిటీలు అయిపోయారో తెలుగు యాంకర్లందరికీ ఇప్పుడు బిగ్ బాస్ మీద విపరీతమైన మోజు పుట్టింది.
బిగ్ బాస్ కేండిడేట్లను బేసిక్ గా సెలక్ట్ చేసేవారి దృష్టిలో పడాలని, బేసిక్ జాబితాలో తమ పేరు వుండేలా చూసుకోవాలని కిందా మీదా అవుతున్నారు.
కొందరయితే తమకు అన్ని కళలు వచ్చు అని చెప్పేందుకు చిట్టి పొట్టి దుస్తులు వేసుకుని డ్యాన్స్ లు కూడా చేస్తూ గ్లామర్ కంటెంట్ ను ప్రదర్శిస్తున్నారు.
ఇదిలా వుంటే సోషల్ మీడియా, టిక్ టాక్ లో కాస్త పాపులర్ అయిన దుర్గారావును కూడా బిగ్ బాస్ లోకి తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తన భార్య లేకుండా ఒక్కడినీ రానని అంటున్నట్లు తెలుస్తోంది. షార్ట్ ఫిలింల ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ పేరు కూడా బిగ్ బాస్ జాబితా పరిశీలనలో వుందని బోగట్టా.