వకీల్ సాబ్ తరువాత వస్తున్న పవర్ స్టార్ సినిమా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్. మలయాళ మాతృక తెలిసిన పవన్ అభిమానులు ఈ సినిమాలో పవన్ మాస్ హీరోయిజం వుంటుందని అనుకోలేదు.
పవన్ నటనకు చాన్స్ మాత్రమే వుంటుందనుకున్నారు. కానీ ఈ సినిమాకు స్క్రిప్ట్, మాటల విషయంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ పలు కీలకమైన మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా పవన్ కు ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను, అందులో అద్భుతమైన ఫైట్ ను జోడించినట్లు తెలుస్తోంది. అంతే కాదు, ఈ ఫైట్ కు తోడుగా మరో మూడు భారీ ఫైట్లు సినిమాలో వుంటాయట.
ఎప్పుడయితే ఈ ఫైట్లు సరిగ్గా సెట్ చేసారో ఎమోషనల్ సినిమా అయిన అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ ఎమోషనల్ యాక్షన్ సినిమాగా మారుతోందన్నమాట. పైగా ఇలా చేయడం వల్ల హిందీ డబ్బింగ్ హక్కుల కోసం ఇరవై కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.