కేటీఆర్ కుమారుడికి అంత‌ర్జాతీయ పుర‌స్కారం

సామాజిక సేవ‌లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌నుమ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్స్‌రావు (15)కు 2021 ఏడాదికి అంత‌ర్జాతీయ పుర‌స్కారం ద‌క్కింది. బ్రిటన్‌లోని ‘తెస్సి ఒజో సీబీఈ’ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత…

సామాజిక సేవ‌లో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌నుమ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్స్‌రావు (15)కు 2021 ఏడాదికి అంత‌ర్జాతీయ పుర‌స్కారం ద‌క్కింది. బ్రిటన్‌లోని ‘తెస్సి ఒజో సీబీఈ’ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్‌ రాజకు మారి డయానా పేరిట ఈ అవార్డు నెల‌కొల్సింది.  

ప్రపంచ వ్యాప్తంగా సామాజిక సేవలందించే 9-25 ఏళ్లలోపు వారికి ఈ అవార్డు ఇస్తారు. హిమాన్ష్‌ ‘శోమ’ అనే పేరుతో త‌న తాత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని గంగాపూర్‌, యూసుఫ్‌ఖాన్‌పల్లి గ్రామాల స్వయం సమృద్ధికి పలు కార్యక్రమాలను చేపట్టారు. 

హిమాన్ష్ ప్రాజెక్టు అవార్డుకు ఎంపిక కావ‌డం విశేషం. ఈ అవార్డును ఆన్‌లైన్‌లో స్వీకరించారు. తన ప్రాజెక్టుకు దిశానిర్దేశం చేసిన తన తాత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు హిమాన్షు ధన్యవాదాలు తెలిపారు. 

హిమాన్ష్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ పురస్కారం దక్కించుకున్న హిమాన్ష్‌ తండ్రిగా గర్విస్తున్నానన్నారు. హిమాన్ష్‌కు ప్ర‌తిష్టాత్మ‌క అంత‌ర్జాతీయ పుర‌స్కారం రావ‌డంపై కుటుంబ స‌భ్యుల‌తో పాటు టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.