జూలై వరకు నో షూటింగ్స్?

మళ్లీ టాలీవుడ్ ఎప్పుడు కళకళ లాడుతుంది? ఇది మరీ మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే కాదు. కానీ సమాధానం మాత్రం గ్యారంటీ ట్యాగ్ లైన్ తో అయితే రాదు. టాలీవుడ్ కళకళ లాడాలి అంటే…

మళ్లీ టాలీవుడ్ ఎప్పుడు కళకళ లాడుతుంది? ఇది మరీ మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే కాదు. కానీ సమాధానం మాత్రం గ్యారంటీ ట్యాగ్ లైన్ తో అయితే రాదు. టాలీవుడ్ కళకళ లాడాలి అంటే రెండు విషయాలు జరగాలి. ఒకటి షూటింగ్ లు ప్రారంభం కావాలి. రెండవది థియేటర్లు ఓపెన్ కావాలి.

థియేటర్లు ఓపెన్ అయితే నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, థియేటర్ కార్మికుల సమస్య  తీరుతుంది. షూటింగ్ లు ప్రారంభం అయితే మొత్తం టాలీవుడ్ సమస్య తీరుతుంది. కానీ ఈ రెండూ కూడా ప్రభుత్వాల దృష్టిలో లాస్ట్ ప్రయారిటీనే. అంతే కాదు, ఈ రెండూ కూడా కరోనా వ్యాప్తికి దోహదం చేసేవే.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం జూలై నుంచి కానీ షూటింగ్ లకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లకు అనుమతి ఇస్తారని తెలుస్తోంది. కరోనా వ్యాప్తిని బట్టి, మే 3న లాక్ డౌన్ తొలగించిన 15 రోజుల తరువాతే థియేటర్లు,షూటింగ్ ల గురించి ఆలోచిస్తారని, అప్పటి వరకు వాటి సంగతి పట్టించుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవు అని టాలీ వుడ్ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ కు కాస్త ఇబ్బందే. జూలై నుంచి షూటింగ్ లు ప్రారంభమైతే, ఆచార్య, వకీల్ సాబ్,  ఆర్ఆర్ఆర్, బోయపాటి-బాలకృష్ణ లాంటి పెద్ద సినిమాలు అర్జెంట్  గా కంప్లీట్ చేయాల్సి వుంటుంది. ఇవి కాక మీడియం సినిమాలు మరో పది వరకు వున్నాయి. ఈ సినిమాలు అన్నీ పూర్తి కావాలంటే కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల కాలం పడుతుందని అంచనా. 

ఇక ప్లానింగ్ లో వున్న కొత్త ప్రాజెక్టులు పట్టాల మీదకు తేవాలంటే ఇవన్నీ ఓ కొలిక్కి రావాల్సి వుంటుంది.

డీజీపీ చేసిన పనికి ఎవ్వరైనా హ్యట్సాఫ్ చెప్పితీరుతారు