త్రివిక్రమ్ నెక్స్‌ట్ తారక్‌తోనే

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ పార్ట్ మే నెలలోగా అయిపోతుందని అనుకున్నారు. అందుకే త్రివిక్రమ్‌తో సినిమా జూన్‌లోనే మొదలవుతుందని, వచ్చే వేసవిలో విడుదల కానుందని అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్…

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ పార్ట్ మే నెలలోగా అయిపోతుందని అనుకున్నారు. అందుకే త్రివిక్రమ్‌తో సినిమా జూన్‌లోనే మొదలవుతుందని, వచ్చే వేసవిలో విడుదల కానుందని అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తి కావడానికి టైమ్ పడుతుందని భావిస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ ఈలోగా చిన్న సినిమా ఏదయినా చేస్తాడని ప్రచారం చేస్తున్నారు.

మొన్నామధ్య అయితే మహేష్‌తో త్రివిక్రమ్ సినిమా ముందు మొదలవుతుందని పుకార్లు పుట్టించారు. కానీ ఆరు నూరయినా త్రివిక్రమ్ మలి చిత్రం తారక్‌తోనే వుంటుందని తాజా సమాచారం. ఈలోగా మరో సినిమా మొదలు పెట్టే ఆలోచన త్రివిక్రమ్‌కి లేదు. ‘అల వైకుంఠపురములో’ విడుదలకి ముందే తారక్‌తో తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ ఖాయం చేసుకున్నాడు.

అందుకే పవన్‌కళ్యాణ్ తిరిగి నటిస్తున్నా కానీ ఇద్దరి సినిమా ఇంతవరకు అనౌన్స్ అవలేదు. ఒకవేళ త్రివిక్రమ్‌కి మరీ తీరిక దొరికితే వేరే చిత్రాలకి మాటలు రాయవచ్చు కానీ దర్శకత్వం వహించే మలి చిత్రం మాత్రం తారక్ ముప్పయ్యవ సినిమానే. ఈ చిత్రానికి కథ, కథనం రాసే పనిలోనే త్రివిక్రమ్ ప్రస్తుతం పూర్తిగా నిమగ్నమై వున్నాడు. కాబట్టి ఆయన తదుపరి చిత్రంపై వినిపిస్తోన్న పుకార్లని పట్టించుకోనవసరం లేదు.

పంజాబ్ పోలీసులు ఏంచేసారో చూస్తే షాక్ అవుతారు

జగన్ కరోనా టెస్ట్ ఎందుకు చేయించుకున్నారు