కళ్యాణ్ సుంకరపై ‘హ్యాకర్ల’దాడి

ఓ సెక్షన్ ఆఫ్ మీడియా మీద తన సెటైరికల్ వీడీయోలతో తీవ్రమైన సైద్దాంతిక దాడి చేస్తున్న జనసేన సింపతైజర్, న్యాయవాది దిలీప్ కళ్యాణ సుంకర సోషల్ మీడియా పేజీల మీద ఇటు అతని వ్యతిరేక…

ఓ సెక్షన్ ఆఫ్ మీడియా మీద తన సెటైరికల్ వీడీయోలతో తీవ్రమైన సైద్దాంతిక దాడి చేస్తున్న జనసేన సింపతైజర్, న్యాయవాది దిలీప్ కళ్యాణ సుంకర సోషల్ మీడియా పేజీల మీద ఇటు అతని వ్యతిరేక వర్గం, అటు హ్యాకర్లు కూడా విరుచుకుపడ్డారు. 

ఆయన ఫేస్ బుక్ పేజ్ ను, ఆయన యూ ట్యూబ్ చానెల్ ను వేలాది మంది రిపోర్ట్ కొట్టడంతో రెండూ ఆగిపోయాయి. దాంతో యూ ట్యూబ్, ఫేస్ బుక్ సిబ్బందితో సందేశాలు, డిస్కషన్లు సాగించి, తనవి హేట్ స్పీచ్, సెక్స్ వుల్ కంటెంట్ కాదని నిరూపించి మళ్లీ వాటిని పునరుద్దరించుకున్నారు.

ఈలోగా యూ ట్యూబ్ చానెల్ మీద హ్యాకర్లు దాడి చేసారు. కొంత కంటెంట్ ను డిలీట్ చేసారు. యూ ట్యూబ్ చానెల్ మీద హ్యాకర్లు దాడి చేసినట్లు యూ ట్యూబ్ సిబ్బంది కన్ ఫర్మ్ చేసి, అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఆఖరికి మళ్లీ ఛానెల్ ను పునరుద్దరించుకున్నట్లు కళ్యాణ్ సుంకర తన ఫేస్ బుక్ పేజీలో తెలియచేసారు. ఆదివారం ఉదయం అప్ లోడ్ చేసాల్సిన వీడీయోను సాయంత్రం అప్ లోడ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.