శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎంఎస్ఆర్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్నారు.
చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా ఈ సినిమాలో వరుణ్ సందేశ్ పోషిస్తున్న వాసు పాత్రకి సంబంధించిన లుక్ విడుదలైంది, ఫర్నాజ్ శెట్టి పోషిస్తున్న ఇందు పాత్రకి సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. గ్లామరస్ గా ఆకట్టుకునేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేసారు.
ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే పూర్తియింది, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో భారీగా వేసిన సెట్స్ లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరిగింది.
ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సినిమా విడుదల వివరాలు త్వరలో తెలియచేస్తారు.