టీడీపీ నేతల్లో అసలైన వణుకు ఇప్పుడు మొదలైంది

ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత టీడీపీ నేతలందరికీ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. అధికార మార్పిడి ఖాయంగా జరుగుతుందని, ఈసారి జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అర్థమైంది.  Advertisement అయినా…

ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత టీడీపీ నేతలందరికీ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. అధికార మార్పిడి ఖాయంగా జరుగుతుందని, ఈసారి జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అర్థమైంది. 

అయినా ఎక్కడో చిన్న ఆశ, పసుపు-కుంకుమ పేరుతో ఓ భరోసా. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఆ నమ్మకం కూడా వమ్మయింది. ఇక పూర్తిగా వారి భ్రమలు వీడడానికి మూడు రోజులు మాత్రమే టైముంది. ఈలోగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ టీడీపీ నేతల్లో వణుకు పుట్టిస్తున్నాయి.

జగన్ వస్తే తమ భవిష్యత్ ఏంటనే ఆందోళనలో పడిపోయారు నేతలు. చంద్రబాబు హయాంలో అవినీతి మేత మేసినవారంతా ఈ లిస్ట్ లో ఉన్నారు. పోనీ పార్టీ ఫిరాయిద్దాం అనుకుంటే, అలాంటివి ప్రోత్సహించే రకం కాదు జగన్. ఇతరత్రా ప్రలోభాలకు లొంగే రకం అంతకంటే కాదు. అందుకే నేతల్లో ఈ వణుకు.

సీఆర్డీఏ పేరుతో అమరావతి కుంభకోణాలన్నిటికీ సాక్షీభూతంగా నిలిచిన మంత్రి నారాయణ, నీరు-చెట్టు, వ్యవసాయ పనుల్లో కోట్ల రూపాయలు వెనకేసుకున్న సోమిరెడ్డి, చంద్రబాబు వాటాలు పోగా.. ప్రాజెక్టుల పనుల్లో ఓ రేంజ్ లో తన హస్తవాసి చూపించిన దేవినేని.. వీళ్లతో పాటు చాలా అక్రమాలు చేసిన దాదాపు టీడీపీ నేతలంతా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూసి భయపడుతున్నారు.

మొన్నటివరకు వీళ్లందర్లో ఓ చిన్నపాటి ఆశ ఉండేది. వీళ్లకు లేకపోయినా, బాబు అలా ఆశలు కల్పించారని అనుకోవాలి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల రాకతో వీళ్ల భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. ఓవైపు ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొద్దంటూ చంద్రబాబు బుకాయిస్తున్నప్పటికీ, నేతలందరికీ భవిష్యత్ కళ్లముందు కదులుతోంది. 

జగన్ అధికారంలోకి వస్తే, సాక్షాత్తూ చంద్రబాబే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందనే అంచనాల మధ్య.. మిగతా నేతలంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో టీడీపీ నేతల బీపీ లెవల్స్ అమాంతం పెరిగాయి.

తెలుగు హీరోల మంచితనం.. సినిమాల వరకేనా!

ఎమ్బీయస్‌: బెదురు బాబు