విశాఖ జిల్లా భీమిలీ అసెంబ్లీ సీటు ఎపుడూ వెరీ హాట్ అనే చెప్పాలి. అందమైన ప్రదేశం. అంతే కాదు అటు రాజకీయ నాయకులకు, ఇటు పర్యాటకులకు నచ్చిన ప్లేస్ కూడా. భీమిలీ తెలుగుదేశానికి ఒకప్పుడు కంచుకోట. అక్కడ ఎవరు పోటీ చేసిన గెలుస్తారు అన్న ధీమా ఉంది. అయితే 2019 ఎన్నికలలో జగన్ వేవ్ లో వైసీపీ ఇక్కడ బంపర్ విక్టరీ కొట్టింది.
ఇక్కడ ఆయన మీద పోటీ చేసిన మాజీ ఎంపీ సబ్బం హరి ఈ మధ్యనే దివంగతులయ్యారు. దీంతో ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారు అన్న ప్రచారం అయితే సాగుతూ వచ్చింది. ఇపుడు టీడీపీ అధినాయకత్వం సడెన్ గా భీమిలీకి ఇంచార్జిని నియమించింది.
దాంతో గంటా ఆశలకు చెక్ పడినట్లేనా అన్న చర్చ అయితే సాగుతోంది. మరో వైపు వచ్చే ఎన్నికలలో లోకేష్ భీమిలీ నుంచి పోటీ చేస్తాడన్న టాక్ నడుస్తోంది.
దాంతో అప్పటిదాకా ఇంచార్జితో కధ నడిపి సరైన టైమ్ లో చినబాబు భీమిలీ నుంచి బరిలో దిగుతారు అన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. మొత్తానికి చూసుకుంటే గంటా భీమిలీ సీటు మీద ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న చర్చ అయితే టీడీపీలో ఉంది మరి.