జ‌గ‌న్ కేసుల‌పై విచార‌ణ‌.. వైఎస్సార్సీపీకి కావాల్సిందిదే!

ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు అమ‌రావ‌తి భూ కుంభ‌కోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. రాజ‌కీయాల్లో చేసే ఆరోప‌ణ‌లూ, ప్ర‌త్యారోప‌ణ‌ల‌పై కొంత‌మంది కేసులు పెడుతూ ఉంటారు.…

ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు అమ‌రావ‌తి భూ కుంభ‌కోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. రాజ‌కీయాల్లో చేసే ఆరోప‌ణ‌లూ, ప్ర‌త్యారోప‌ణ‌ల‌పై కొంత‌మంది కేసులు పెడుతూ ఉంటారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ, అధినేత మెప్పు పొందేందుకు అలాంటి ప్ర‌య‌త్నాలు కొంద‌రు చేస్తూ ఉంటారు. 

ఆ క్ర‌మంలోనే గ‌తంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కొంద‌రు స్థానిక పోలిస్ స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేయ‌డం, ఆ ఫిర్యాదుల‌ను తీసుకుని పోలీసులు కేసులు పెట్ట‌డం, అవి కోర్టు విచార‌ణ‌కు వెళ్ల‌డం జ‌రుగుతూ ఉంటుంది. స‌రిగ్గా జ‌గ‌న్ పై అలాంటి కేసులు న‌మోద‌య్యాయి. 

ఆ త‌ర్వాత ఎన్నిక‌లు వ‌చ్చాయి. టీడీపీ అధికారం నుంచి దిగిపోయింది. దీంతో అప్పుడు కేసులు వేసిన వారికి స‌హ‌జంగానే ఇప్పుడు వాటిపై పోరాడాల‌నేంత ఉత్సాహం ఉండ‌దు. అదెందుకో వేరే వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. అప్పుడు ఎవ‌రి మెప్పు కోస‌మో అలాంటి ఫిర్యాదులు, పిటిష‌న్లు వేస్తారు. 

ఇప్పుడు అలాంటి వారే పార్టీలు మారి ఉన్నా ఆశ్చ‌ర్యం లేదు. వాళ్ల‌కు కావాల్సింది అధికారంలో ఉన్న వారి అండ‌దండ‌లు. అలా జ‌గ‌న్ పై కేసులు వేసిన వారు వివిధ కోర్టుల్లో త‌మ పిటిష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. అది ఇప్పుడే ఎందుకు జ‌రిగిందంటే.. దానికి స‌మాధానం కూడా సుల‌భ‌మే. గ‌జం మిథ్య‌, ప‌లాయ‌నం మిథ్య అన్న‌ట్టుగా ఈ వ్య‌వ‌హారాలు ఉంటాయ‌ని.. పాలిటిక్స్ గురించి కూసింత అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రిని అడిగినా చెబుతారు.

అలాంటి అంశం ఇప్పుడు అంతులేని ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంటోంది. జ‌గ‌న్ కేసుల కొట్టివేత అంటే.. అవి సీబీఐ న‌మోదు చేసిన కేసుల్లాంటివి కావు సుమా! ఇవ‌న్నీ .. చంద్ర‌బాబు తిన్నాడు, అవినీతి జ‌రిగింది.. అంటూ చేసిన ఆరోప‌ణ‌ల‌పై న‌మోదైన కేసులు. ఈ కేసుల ఎత్తివేత‌పై డైరెక్టుగా టీడీపీ కంప్లైంట్ ఇవ్వ‌లేక‌పోయింది! ఇస్తే.. టీడీపీకి సంబంధించిన ఇలాంటి పాత వ్య‌వ‌హారాల‌న్నీ బ‌య‌ట‌ప‌డ‌తాయి. అయితే ఈ వ్య‌వ‌హారం మ‌రో ర‌కంగా విచార‌ణ‌కు నోచుకుంటోంది. 

ఇక ఇదే అంశంపై ప‌చ్చ‌మీడియా గంగ‌వెర్రులెత్తుతోంది. అదిగో.. అధికారాన్ని ఉప‌యోగించుకుని జ‌గ‌న్  కేసులెత్తేసుకున్నాడ‌ని చ‌ర్చ‌లు పెట్ట‌డం, ఆ చ‌ర్చ‌ల వీడియోలు దాచి వేయ‌డం, మ‌ళ్లీ వాటిని ప‌బ్లిక్ లోకి పెట్టి.. బుకాయించ‌డం.. ఇదీ వ‌ర‌స‌. జ‌గ‌న్ కేసుల‌ను త‌ను ఎత్తేసుకోలేదు. 

కోర్టులే ఆ కేసుల‌ను ఎత్తేశాయి. ఆ వ్య‌వ‌హారం గురించి అడ్మినిస్ట్రేటివ్ క‌మిటీ సుమోటో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ విచార‌ణ ఎంత జ‌రిగితే వైఎస్ఆర్సీపీకి కూడా అంత మేలు అనుకుంటున్న‌ట్టుగా ఉంది. అందుకే ఈ అంశం గురించి జ‌గ‌న్ సొంత ప‌త్రిక ఫ‌స్ట్ పేజీ ప్రాధాన్య‌త‌ను ఇస్తోంది! అందులోని ఉద్దేశం ఏమిటో.. అర్థం కానంత పొలిటిక‌ల్ సైన్స్  ఏమీ కాదు.