మహేష్ కేరవాన్..కెవ్వు..కేక

హీరోలు స్వంత కేరవాన్ లు చేయించుకోవడం అన్నది కొత్త కాదు. బాలీవుడ్ లో మొదలైంది. టాలీవుడ్ కు దిగుమతి అయింది. ఈ విషయంలో అందరి కన్నా ముందు అడుగు వేసింది సూపర్ స్టార్ మహేష్…

హీరోలు స్వంత కేరవాన్ లు చేయించుకోవడం అన్నది కొత్త కాదు. బాలీవుడ్ లో మొదలైంది. టాలీవుడ్ కు దిగుమతి అయింది. ఈ విషయంలో అందరి కన్నా ముందు అడుగు వేసింది సూపర్ స్టార్ మహేష్ బాబునే. 

ఆ మధ్య బన్నీ తన స్టయిల్ లో ఓ మాంచి కేరవాన్ ను డిజైన్ చేయించుకున్నారు. ఎక్కడ షూటింగ్ అయినా అదే ముందు వెళ్లిపోతుంది అక్కడికి. 

ఇప్పుడు మహేష్ మళ్లీ కొత్త కేరవాన్ ను తీసుకున్నారు. సుమారు ఏడెనిమిది కోట్ల వ్యయంతో ఈ కేరవాన్ తయారైంది. చిన్న గెస్ట్ హాల్, బెడ్ రూమ్, బాత్ రూమ్, స్మాల్ కిచెన్, ఇంకా సకల సదుపాయాలు ఇందులో వున్నాయని టాలీవుడ్ లో కబుర్లు చాలా చాలా వినిపిస్తున్నాయి. 

పూనేలో ఈ కేరవాన్ రెడీ అయింది. మహేష్ కు విలాసవంతమైన ఇంటీరియర్ అంటే ఇష్టం. అందుకు అనుగుణంగానే ఈ వ్యాన్ కోసం కాస్త గట్టిగానే ఖర్చుచేసినట్లు బోగట్టా.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్