ప్యాంట్ లేని పాత ఫొటోతో స‌రిపెట్టుకొమ్మ‌న్న ఇలియానా!

అస‌లే ఇది క‌రోనా కాలం. హీరోయిన్ల‌కు కూడా ఇది పూర్తిగా క‌రువు కాల‌మే, ఇంత‌కు ముందు అయితే.. దేశ విదేశాల్లో తిరుగుతూ, అంద‌మైన బీచ్ ల‌లో, సూప‌ర్భ్ లొకేష‌న్ల‌లో ఫొటోలు దిగి ఇన్ స్టాగ్ర‌మ్…

అస‌లే ఇది క‌రోనా కాలం. హీరోయిన్ల‌కు కూడా ఇది పూర్తిగా క‌రువు కాల‌మే, ఇంత‌కు ముందు అయితే.. దేశ విదేశాల్లో తిరుగుతూ, అంద‌మైన బీచ్ ల‌లో, సూప‌ర్భ్ లొకేష‌న్ల‌లో ఫొటోలు దిగి ఇన్ స్టాగ్ర‌మ్ లో పోస్టు చేసే వాళ్లు. అదంతా క‌ల‌ర్ ఫుల్ గా ఉండే వ్య‌వ‌హారం. అయితే ఇప్పుడు క‌రోనా ప్ర‌భావంతో ఇళ్ల‌లోనే పూర్తిగా లాక్ అయిపోయిన వాళ్ల‌లో హీరోయిన్లు కూడా ఉన్నారు.

ఈ విష‌యాన్నే చెబుతోంది ఇలియానా డిక్రూజ్. ఇప్పుడు పోస్టు చేయ‌డానికి కొత్త ఫొటోలు లేవ‌ని, పాత ఫొటోతో స‌రిపెట్టుకోవాల‌ని ఈమె త‌న ఫాలోయ‌ర్ల‌కు చెబుతూ ఒక ఫొటో పోస్టు చేసింది. త్రో బ్యాక్ అంటూ ఇది వ‌ర‌కూ త‌ను పోస్టు చేసిన పిక్ ను మ‌ళ్లీ పోస్టు చేసింది ఇలియానా.

ఈ ఫొటోలో త‌న జ‌డ‌లో పూలున్నాయ‌ని, కాళ్ల‌కు చెప్పులు, కింద ప్యాంటు లేవ‌ని..ఇలియానా త‌న పోస్టులో వివ‌రించుకొచ్చింది. ఈ త్రో బ్యాక్ పిక్ కు ఇలియానా జీవితంలో మ‌రో ప్రాధాన్య‌త కూడా ఉండొచ్చు. అదేమిటంటే.. ఈ పిక్ ను త‌న బాయ్ ఫ్రెండ్ తో బీచ్ ల‌లో వివాహ‌రించిన కాలాల్లో మొద‌టి సారి పోస్టు చేసింది ఇలియానా. కొంత కాలం కింద‌ట అత‌డితో ఈమె విడిపోయింది. మ‌రి త్రో బ్యాక్ ఫొటోల‌తో ఇలియానాకు మాజీ ప్రియుడు గుర్తుకు రాలేదేమో!

పాత ఫొటోనే అయినా ఇలియానా ఫ్యాన్స్ కు మాత్రం ఇది బాగా న‌చ్చుతోంది. పోస్టు చేసిన తొలి రెండు గంట‌ల్లోనే ఐదు ల‌క్ష‌ల లైక్స్ వ‌చ్చేయ‌డ‌మే, ఇలియానా గ్లామ‌ర్ కు డిమాండ్ త‌గ్గ‌డం లేద‌నేందుకు రుజువులాగుంది!

మెగాస్టార్ వాయిస్ మెసేజ్

చిరు అడుగుజాడల్లో హీరో శ్రీకాంత్