ఆమె శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ కావడం గర్వకారణంగా అంతా భావిస్తారు. ఆముదాలవలసకు చెందిన కరణం మళ్ళీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ గా భారత్ కి ఘనమైన కీర్తిని సంపాదించి పెట్టారు.
ఇక 2000 లో సిడ్నీలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆమె మొదటి ఒలింపిక్ మెడల్ ని దేశానికి సాధించి ఒక్కసారిగా ఖ్యాతిని పెంచారు. ఆమెను పద్మశ్రీ, అర్జున అవార్డ్ వంటివి ఎన్నో వరించి వచ్చాయి.
ఇపుడు ఏకంగా ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ గా ఆమెని ప్రభుత్వం నియమించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నారు.
ఆమె క్రీడారంగానికి చేసిన సేవలకు గానూ ఈ గౌరవం దక్కడం గొప్ప విషయమని అంటున్నారు. కరణం మళ్ళీశ్వరి స్పూర్తితో ఎందరో క్రీడాకారులు తరువాత కాలంలో కూడా ఏపీ నుంచి వెళ్ళి రాణించారు.
ఇపుడు ఆమె అనుభవంతో దేశమంతటా క్రీడారంగానికి విశేష సేవ అందిస్తారు అని శ్రీకాకుళం జిల్లా వాసులతో సహా వివిధ రంగాల ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.