మా సంఘ కార్యవర్గ ఎన్నికలు మూడు నెలల తరువాత వున్నాయి. కానీ ఇప్పటి నుంచే సందడి మొదలైంది. ఇప్పటికే ముగ్గురు అభ్యర్ధులు పోటీలోకి వచ్చారు అనుకుంటే నటి హేమ కూడా తాను కూడా పోటీ చేస్తున్నా అని ప్రకటించేసారు. దీంతో జీవిత వర్గం కాస్త డీలా పడింది.
ఎందుకంటే విష్ణు, ప్రకాష్ రాజ్, జీవిత పోటీలో వుంటే జీవితకు ఎడ్జ్ వుంటుంది. కానీ హేమ కూడా రంగంలో వుంటే ఈక్వేషన్లు మారిపోతాయి.
జీవిత రంగంలోకి దిగడంతోనే ఆమెను కట్టడి చేయడానికే హేమను రంగంలోకి దింపారని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు, ఆ వర్గం ఓట్లు మరింతగా చీల్చేందుకు మరో ఒకరిద్దరని కూడా రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని బోగట్టా.
అదే నిజమైతే ప్రకాష్ కు రావాల్సిన ఓట్లు రకరకాలుగా చీలిపోతాయి.జీవిత, హేమ, ఇంకా కొత్తగా వచ్చే పేర్లు అన్నీ పంచుకుంటాయి. నరేష్ బ్యాక్ సపోర్టుతో విష్ణు ఓట్లు సాలిడ్ గా వుంటాయి. మొత్తం మీద మా ఎన్నికల వ్యవహరం రోజు రోజుకు ఓ మలుపు తిరుగుతోంది.