వైఎస్ కల…జగన్ సాకారం…

వైఎస్సార్ ఏపీలో జల ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోయారు. ఆయన హయాంలోనే అనేక ప్రాజెక్టులు రూపు దిద్దుకున్నాయి. పోలవరానికి ప్రాణం పోసిన ఘనత కూడా ఆయనదే.  Advertisement ఇపుడు ఆయన తనయుడు జగన్ సీఎం గా…

వైఎస్సార్ ఏపీలో జల ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోయారు. ఆయన హయాంలోనే అనేక ప్రాజెక్టులు రూపు దిద్దుకున్నాయి. పోలవరానికి ప్రాణం పోసిన ఘనత కూడా ఆయనదే. 

ఇపుడు ఆయన తనయుడు జగన్ సీఎం గా ఉండగా పోలవరం పూర్తి అవుతుందని అంతా భావిస్తున్నారు. మరో వైపు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార మీద నిర్మిచే ప్రాజెక్టులకు కూడా జల యజ్ణం కింద వైఎస్సార్ హయాంలోనే ప్రతిపాదించారు.

అందులో ముఖ్యమైనది నేరేడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా వంశధార నది నీరు సముద్రంలో కలవడకుండా వాడుకోవాలని ప్రతిపాదించారు. అయితే ఈ బ్యారేజ్ కట్టడానికి ఒడిశా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. చివరికి వంశధార ట్రిబ్యునల్ ఏపీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

ఇది కనుక పూర్తి అయితే 57.5 టీఎంసీల నీరు శ్రీకాకుళానికి దక్కుతాయి. దీంతో సాగు, తాగు నీటి కష్టాలు పూర్తిగా తొలగనున్నాయి. జగన్ సీఎం గా ఉండగా ఈ తీర్పు రావడం పట్ల జిల్లావాసులతో పాటు అధికార పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తీర్పు పాజిటివ్ గా రావడంతో బ్యారేజ్ నిర్మాణానికి యాక్షన్ ప్లాన్ ని రెడీ చేయమని జగన్ అధికారులను ఆదేశించడంతో సుదీర్ఘకాలంగా కలగా ఉన్నా ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుంది.  

మొత్తానికి సిక్కోలుతో మొదలు పెడితే పోలవరం సహా ఏపీలోని జల వనరుల ప్రాజెక్టులు అన్నీ జగన్ హయాంలో పూర్తి చేస్తామని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు.