కరోనా కేసులు పెరగడం లేదని బాబు ఏడుపు

అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే.. అదే నిజమనే అపోహ కలిగించొచ్చు. ఇలాంటి గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు దిట్ట. ఇప్పుడు దాన్ని జగన్ కు అంటగట్టాలని చూస్తున్నారు. “పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా…

అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే.. అదే నిజమనే అపోహ కలిగించొచ్చు. ఇలాంటి గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు దిట్ట. ఇప్పుడు దాన్ని జగన్ కు అంటగట్టాలని చూస్తున్నారు. “పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, ఏపీలో మాత్రం కేసుల సంఖ్య అనుకున్నంతగా పెరగడం లేదు, పాజిటివ్ కేసుల్ని దాచిపెడుతున్నారం”టూ చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత మీడియాతో ఎప్పుడు మాట్లాడినా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. ఏపీలో కరోనా కేసులు కావాలనే దాచిపెడుతున్నారంటూ గోల చేస్తున్నారు.

పోనీ అలాగే అనుకుందాం. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల్ని బైటపెట్టే విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తోందనే నమ్ముదాం. దానివల్ల ఎవరికి లాభం. కరోనా కేసుల్లేవు అని చెప్పుకుంటే ఆ మహమ్మారిని సమర్థంగా కట్టడి చేశారనే పేరు ప్రభుత్వానికి వస్తుందేమో కానీ, ఆ తర్వాత మరణాల విషయంలో సమాజం ముందు దోషిగా నిలబడుతుంది కదా? పోనీ కరోనా పాజిటివ్ కేసుల్ని దాచిపెట్టాలని ప్రభుత్వం చూసినా అధికారులు ఊరుకుంటారా? మత్తు డాక్టరో, మదమెక్కిన కమిషనరో.. ఇలా బాబు గుంటనక్కలు అక్కడక్కడ ఉంటాయి కదా, వాటి ద్వారా సమాచారం బైటపెట్టించొచ్చు కదా?

ఒకవేళ నిజంగానే జగన్ కేసుల సంఖ్యను దాచి ఉంచాలనుకుంటే అది కూడా ఒకరకంగా సమాజానికి మేలు చేసేదే. ఇక్కడ, అక్కడ కేసులు పెరిగిపోయాయనే వార్తలతో జనాల్ని భయాందోళనలకు గురికాకుండా చేయడం కూడా విపత్తు వేళ అత్యవసరమే. ప్రభుత్వం ఆ పని సమర్థంగా నిర్వహించి, రోగులందరికీ రహస్యంగా వైద్యం అందించి.. అందకిరీ నయం చేసి ఇళ్లకు పంపితే అంతకంటే కావాల్సిందేముంటుంది. ప్రజల్లో భయం పెరగకుండా, అటు మరణాల సంఖ్య పెరగకుండా చేస్తే అది మంచి వ్యూహమే కదా.

ఇంతకీ చంద్రబాబు కోరుకుంటున్నదేంటి? ఇప్పటి వరకూ కేసుల సంఖ్యను దాచిపెట్టామని నిజం ఒప్పుకుని జగన్ లెంపలేసుకోవాలా? లేదా చంద్రబాబు ఇన్వెస్టిగేషన్లో నిజం బైటపడిందని భయపడాలా? ఏపీలో కూడా కేసులు భారీగా పెరిగితే చంద్రబాబుకి సంతోషమా? కరోనా విలయతాండవాన్ని చూస్తేనే బాబు కళ్లు చల్లబడతాయా..? అసలు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు.

చంద్రబాబు మేకప్ మానడు, ఉమా గాడు విగ్గు తియ్యడు