టీడీపీకి రివర్స్ అవుతున్న ఎల్లో ప్రచారం..!

వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ విధానాలను విమర్శించాలనుకున్న ప్రతి సారీ టీడీపీకి ఎదురుదెబ్బ తగులుతోంది. జగన్ చేస్తున్న పనులకు వంకలు పెడుతున్న క్రమంలో, అసలు టీడీపీ హయాంలో పనులేవీ జరగలేదనే విషయాన్ని ఒప్పుకున్నట్టయింది.  Advertisement సంక్షేమ…

వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ విధానాలను విమర్శించాలనుకున్న ప్రతి సారీ టీడీపీకి ఎదురుదెబ్బ తగులుతోంది. జగన్ చేస్తున్న పనులకు వంకలు పెడుతున్న క్రమంలో, అసలు టీడీపీ హయాంలో పనులేవీ జరగలేదనే విషయాన్ని ఒప్పుకున్నట్టయింది. 

సంక్షేమ పథకాల్లో భాగంగా ఆర్థిక సాయం విడుదల చేసే ప్రతిసారీ టీడీపీ నుంచి విమర్శలొస్తున్నాయి, అరకొర సాయం అని, వేరే పథకాల నిధులు మళ్లించారని, లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉందని, ఇలా.. రకరకాలుగా జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. అయితే టీడీపీ హయాంలో కనీసం ఆ సాయం కూడా లేదు కదా అని రివర్స్ లో నెటిజన్లు ప్రశ్నిస్తుండే సరికి, ఎరక్కపోయి ఇరుక్కుపోయామనుకుంటోంది ఎల్లో బ్యాచ్.

తాజాగా వైఎస్సార్ చేయూత పథకంపై కూడా టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. అందంగా ఫొటోలు తయారుచేయించి, అబద్ధాలు రాస్తున్నారని, చేస్తున్న సాయం పెద్దగా ఏమీ లేదంటూ కాకి లెక్కలు తీస్తున్నారు చంద్రబాబు. కానీ అసలు బాబు హయాంలో చేయూత ఎవరికైనా అందించారా అనే ప్రశ్న రివర్స్ లో వినిపిస్తోంది. ఏ సాయమూ అందించని బాబు, సాయం చేస్తున్న జగన్ ని ఎలా విమర్శిస్తున్నారంటూ మొట్టికాయలు పడుతున్నాయి.

వాహన మిత్ర కోసం ఇతర పథకాల నిధులు మళ్లించారంటూ ఆమధ్య చాలామంది లా పాయింట్లు తీశారు. నిధులు లేని కష్టకాలంలో ఇతర శాఖలలో ఉన్న మిగులు వనరుల్ని ఆటో డ్రైవర్ల కోసం వినియోగించడం ఆ బ్యాచ్ కి కంటగింపుగా మారింది. చివరకు లబ్ధిదారుల నుంచి వచ్చిన ప్రతిస్పందన ఘాటుగా ఉండటంతో ఎల్లో బ్యాచ్ నోరు మూసుకుంది.

జాబ్ క్యాలెండర్ పై చేసిన హంగామా కూడా టీడీపీకి రివర్స్ లో తగిలింది. జాబుల్లేకుండా క్యాలెండర్ రిలీజ్ చేశారనేవారికి సచివాలయం పోస్టులు కనపడలేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఉమ్మడి ఏపీ చరిత్రలో కానీ, నవ్యాంధ్ర చరిత్రలో కానీ ఎప్పుడూ జరగని, ఇకపై జరగలేని విధంగా జగన్ అధికారంలోకి వచ్చిన తొలిఏడాదే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల నియామకం జరిగింది. ఇదంతా మరచిపోయి టీడీపీ బ్యాచ్ గజినీల్లా మారిపోయారా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

గ్రూప్-1 ఇంటర్వ్యూల విషయంలో ఎరక్కపోయి ఇరుక్కుపోయారు లోకేష్. కనీసం జగన్ హయాంలో గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయి, కానీ చంద్రబాబు అసలేం చేశారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బాబు హయాంలో పోస్ట్ లు భర్తీ చేయకుండా ఇప్పుడు రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు అభ్యర్థులు. ఇంటర్వ్యూల వేళ తమ భవిష్యత్ తో చెలగాటం ఆడొద్దని వేడుకుంటున్నారు.

నిరుద్యోగ భృతి అనే ఆశ కల్పించి చివరకు, అధికారంలో నుంచి దిగిపోయే నెలల ముందు దాన్ని అమలులో పెట్టి, టీడీపీ కార్యకర్తలకు డబ్బులు దోచిపెట్టిన ఘనత చంద్రబాబుది కాదా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. డీఎస్సీ 2008 అభ్యర్థులకు జగన్ అధికారంలోకి వచ్చాక న్యాయం జరిగిందంటే గత ప్రభుత్వాలు ఏం చేశాయనే ప్రశ్న గట్టిగానే వినపడుతోంది. ఇలా ప్రతి సందర్భంలోనూ జగన్ ని విమర్శించాలనుకున్నవారు తమకు తామే ఇరుక్కుపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ప్రజల ముందు పలుచన అవుతున్నారు.

జగన్ చేస్తున్న పనుల్ని టీడీపీ విమర్శిస్తున్న ప్రతిసారి, 'అరె.. ఈ పనులేవీ బాబు హయాంలో జరగలేదు కదా' అనే విషయం ప్రజలకు గుర్తొస్తోంది. ఈ విషయంలో ఎల్లో మీడియాకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.