ఆందోళనలు సరే.. నాయకత్వం ఎవరిది..?

వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వారోత్సవం చేపట్టిన టీడీపీ.. ఈనెల 29న 175 నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టి ఫినిషింగ్ టచ్ ఇస్తానంటోంది. దీని కోసం ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టారు బాబు. వీడియో…

వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వారోత్సవం చేపట్టిన టీడీపీ.. ఈనెల 29న 175 నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టి ఫినిషింగ్ టచ్ ఇస్తానంటోంది. దీని కోసం ఇప్పటినుంచే కసరత్తులు మొదలు పెట్టారు బాబు. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా నేతలు, కార్యకర్తల్లో ధైర్యం నూరిపోస్తున్నారు. 

అంతా బాగానే ఉంది కానీ.. ఆరోజు ఆందోళనకు నాయకత్వం ఎవరు వహిస్తారనేదే అసలు సమస్యగా మారింది. ఈమధ్య అరేయ్, ఒరోయ్ అంటూ నోరు పారేసుకుంటున్న చినబాబుని రంగంలోకి దింపుతారా, లేక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లైన్లోకి వస్తారా, ఇవన్నీ కుదరదు చంద్రబాబే నేరుగా తెరపైకి వస్తారా అనేది తేలాల్సి ఉంది.

అరెస్ట్ లకు సిద్ధపడాల్సిందే..

కరోనా కష్టకాలంలో ఆందోళనలతో హడావిడి చేస్తే, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కటకటాల వెనక్కు నెడతారు. అందులోనూ టీడీపీ భారీ స్థాయిలో ఈ కార్యక్రమాలను చేయాలని చూస్తోంది. నియోజకవర్గాల్లో జనసమీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే దాదాపుగా అరెస్ట్ లకు సిద్ధపడినవారే ఆందోళనల్లో ముందుండాలన్నమాట. 

సహజంగా టీడీపీలో కార్యకర్తలు త్యాగాలు చేస్తారు, నందమూరి, నారా కుటుంబాలు ఫలాలు అనుభవిస్తాయి. ఇప్పుడు అరెస్టులంటే.. చంద్రబాబు, లోకేష్ కాలు బయటపెడతారా అనేదే డౌట్.

జూమ్ నుంచి పర్యవేక్షణ..

గడ్డం పెంచిన లోకేష్ సోషల్ మీడియా దిగిరాడు. ఎవరైనా చనిపోతేనే శవరాజకీయం కోసం ఆయన కాలు బయటపెడతారు. ఇలాంటి ఆందోళనలంటే.. లోకేష్ కు చిరాకు. ఇక తన తుప్పుపట్టిన బ్రెయిన్ తో చంద్రబాబు జూమ్ నుంచి బయటకు రారు. 

ఆన్ లైన్ లో పర్యవేక్షిస్తాను తమ్ముళ్లూ, ఆందోళనలకు సిద్ధపడండి అంటూ హితోపదేశం మాత్రం చేస్తారు. మరి ఇలాంటి సందర్భంలో టీడీపీ నిరసనలు ఎలా సక్సెస్ అవుతాయో చూడాలి.

కనీసం కార్యకర్తలైనా వస్తారా..?

స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత గ్రామాల్లో టీడీపీ జెండా మోసేవారే కరువయ్యారు. ఇతర పార్టీల్లోకి వెళ్లినా ప్రాధాన్యం దక్కదేమోనన్న అనుమానం ఉన్నవారే టీడీపీలో మిగిలిపోయారు. మరి వారితో ఆందోళనలు సక్సెస్ అవుతాయో లేదో చూడాలి. సైన్యం లేని చోట సేనాని కూడా డౌటే. అచ్చెన్నాయుడు బుచ్చయ్య చౌదరి, కాల్వ, రామానాయుడు.. ఇలా ఎవరూ లీడ్ తీసుకోడానికి ముందుకు రాకపోవచ్చు.

మొత్తమ్మీద టీడీపీ బలమేంటో ఈ నియోజకవర్గాల స్థాయి ఆందోళనలతోనే తేలిపోతుంది. నిరసన కార్యక్రమాల్లో టీడీపీ ఫెయిలైతే.. బీజేపీ-జనసేన కూటమి స్వరం కూడా పెరుగుతుంది. అసలు ప్రతిపక్షం ఓడిపోయింది, అసలైన ప్రతిపక్షం మేమేనంటూ ఆ రెండు పార్టీలు హడావిడి చేస్తాయి. అందుకే టీడీపీ ముందు జాగ్రత్తగా పెయిడ్ బ్యాచ్ లను రంగంలోకి దించుతోందని సమాచారం.