జనసేనకే అధికారం….పక్కా క్లారిటీ

పొరుగు జిల్లాలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఆయన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. పవన్ వారాహి మూడవ విడత విశాఖలో స్టార్ట్ అయింది. ఎయిర్ పోర్టు నుంచే జనసేన క్యాడర్…

పొరుగు జిల్లాలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఆయన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు. పవన్ వారాహి మూడవ విడత విశాఖలో స్టార్ట్ అయింది. ఎయిర్ పోర్టు నుంచే జనసేన క్యాడర్ సీఎం పవన్ అంటూ నినాదాలు చేశారు.

దానికి తగినట్లుగా జగదాంబ జంక్షలో పవన్ స్పీచ్ కూడా సాగింది. జనసేన అధికారంలోకి వస్తే అంటూ ఆయన మాట్లాడారు. విలవిలలాడుతున్న  విశాఖను కాపాడుతామని ఒట్టేశారు. ఏయూని ప్రక్షాణల చేస్తామని మాట ఇచ్చారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను సరి చేస్తామని అన్నారు.

విశాఖ లో పవన్ ప్రసంగం మొత్తం ఆవేశపూరితంగా సాగింది. వచ్చేది జనసేన ప్రభుత్వమే అంటూ ధీమాగా చెప్పడమూ కనిపించింది. వైసీపీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారంతా రెడీగా ఉండాలని పవన్ హెచ్చరించడమూ జరిగింది.

ఏపీలో వైసీపీని ఓడిస్తామని పవన్ అంటున్నారు. తామే అధికారంలోకి వస్తామని  చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు కూటమి గురించి కాకుండా జనసేన మాత్రమే అధికారంలోకి వస్తుందని పవన్ చెప్పడం పైన తీవ్ర స్థాయిలో  చర్చ సాగుతోంది.

చంద్రబాబు సీఎం అవుతారని తమ్ముళ్ళు అంటున్నారు. జనసేన మాత్రమే ఏపీని గాడిలో పెట్టగల పార్టీ అని పవన్ అంటున్నారు. విశాఖలో పవన్ స్పీచ్ చూస్తే సీఎం పదవి కి అధికారానికి తామే ప్రధాన పోటీ అని చెప్పకనే చెప్పారని అంటున్నారు. 

పొత్తులు ఉండొచ్చు, మిత్రుల మధ్య స్నేహాలు ఉండవచ్చు కానీ తమ అజెండాతోనే ముందుకు వెళ్తామని అధికారంలోకి వస్తామని పవన్ మాటలను బట్టి అర్ధం అవుతోంది. పవన్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్న విషయంలో డౌట్ లేదని విశాఖ వారాహి సభ చాటి చెప్పింది అని అంటున్నారు.