థర్డ్ వేవ్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్వేత పత్రం కూడా విడుదల చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ రాకపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
తాను రిలీజ్ చేసిన శ్వేతపత్రం ఓ బ్లూ ప్రింట్ అని, థర్డ్ వేవ్‌కు ఎలా సన్నద్ధం కావాలో చెబుతోందన్నారు. రెండవ వేవ్ సమ యంలో జరిగిన లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. థర్డ్ వేవ్ రావడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. వైరస్ నిరం తరం పరివర్తన చెందుతోందని, తాను రిలీజ్ చేసిన శ్వేతపత్రం లక్ష్యం భవిష్యత్తు ప్రణాళికలను సూచిస్తుందన్నారు. నిపుణులతో చర్చించి నాలుగు విధానాలను డెవలప్ చేసినట్లు రాహుల్ చెప్పారు.
ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మోడీ మొసలి కన్నీళ్లు ప్రజల్ని కాపాడలేవని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ కన్నీళ్లు ప్రజల్ని కాపాడలేవని, కేవలం ఆక్సిజన్ మాత్రమే రక్షిస్తుందని రాహుల్ స్పష్టం చేశారు.
ఇటీవల వారణాసి హెల్త్ వర్కర్లతో మాట్లాడుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనైన నేపథ్యంలో రాహుల్ ఫైర్ అయ్యారు. బెంగాల్ ఎన్నికలపై ప్రధాని దృష్టి పెట్టడం వల్ల ఆక్సిజన్ సరఫరా జరగలేదని రాహుల్ ఆరోపించారు.
వ్యాక్సినేషన్ అనేది కీలకమైన పిల్లర్ అన్నారు. చాలా దూకుడుగా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని, వంద శాతం వ్యాక్సినేషన్ జరగాలన్నారు. ప్రభుత్వాలు ప్రిపేరై ఉండాలని, హాస్పిటళ్లు, ఆక్సిన్, మందులతో సిద్ధంగా ఉండాలని రాహుల్ అప్రమత్తం చేశారు.
సెకండ్ వేవ్ సమయంలో 90 శాతం మందిని రక్షించుకునేవాళ్లమని, కేవలం ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ఘో రం జరిగినట్లు ఆయన వాపోయారు. సోమవారం అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్లు ఇవ్వడం సంతోషకరమని రాహుల్ ప్రశంసిం చడం విశేషం. ప్రతి రోజూ ఇలాగే జరగాలని, జనాభా మొత్తం వ్యాక్సిన్ వేయించుకునే వరకూ ఈ ప్రక్రియ సాగాలన్నారు.