ఇద్దరు డైరక్టర్ల నడుమ మ్యూజిక్ డైరక్టర్

తెలుగులో టాప్ లైన్ లో వున్న మ్యూజిక్ డైరక్టర్లే తక్కువ. వాళ్లనే తిప్పి తిప్పి వాడాల్సి వుంటుంది. అలాంటిది ఇక్కడ కూడా పర్సనల్ పాలిటిక్స్ అడ్డం పడితే..? తెలుగులో ఓ టాప్ మ్యూజిక్ డైరక్టర్…

తెలుగులో టాప్ లైన్ లో వున్న మ్యూజిక్ డైరక్టర్లే తక్కువ. వాళ్లనే తిప్పి తిప్పి వాడాల్సి వుంటుంది. అలాంటిది ఇక్కడ కూడా పర్సనల్ పాలిటిక్స్ అడ్డం పడితే..? తెలుగులో ఓ టాప్ మ్యూజిక్ డైరక్టర్ వున్నారు. 

రెండేళ్లుగా సర్రున దూసుకుపోతున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవైనా కూడా అతని ఖాతాలోకే వస్తున్నాయి. కానీ ఓ డైరక్టర్ మాత్రం దగ్గరకు తీయడం లేదు. అవసరం అయినా కూడా ఏదో విధంగా అడ్జస్ట్ అవుతున్నారు తప్ప ఇతగాడిని తీసుకోవడం లేదు.

ఎందుకు అని ఆరా తీస్తే, ఈ టాప్ మ్యూజిక్ డైరక్టర్ ఓ టాప్ డైరక్టర్ కు బాగా దగ్గరయిపోయాడట. ఈ టాప్ డైరక్టర్ కు, మరో టాప్ డైరక్టర్ కు మధ్య కనిపించని ఇగో క్లాషెస్, కనిపించని పోటీ వుందట. దాంతో ఇతగాడిని తీసుకుంటే తన సినిమా సంగతులు అన్నీ పూసగుచ్చినట్లు ఆ డైరక్టర్ కు చేరిపోతాయేమో అని చిన్న అనుమానం అని తెలుస్తోంది.

అందుకే తన సినిమాలకు అవసరం అయినా ఏదో విధంగా ఎవరో ఒకర్ని పెట్టుకుని నెట్టుకు వస్తున్నారట తప్ప, ఈ మ్యూజిక్ డైరక్టర్ కు అవకాశం ఇవ్వడం లేదట. ఆ డైరక్టర్ కు పని చేసే టీమ్ తనకు వద్దు అన్నది బేసిక్ పాయింట్ అట. సామర్ధ్యం చూడాలి కానీ ఇలాంటి లెక్కలు, చిక్కులు ఏమిటో?