రకరకాల సినిమాలు ట్రయ్ చేయడంలో హీరో నాగ్ మొదట్నించీ ముందు వుంటూ వస్తున్నారు. యూత్ ఫుల్ సినిమాల దగ్గర నుంచి ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే, మాస్ సినిమాలు కూడా అటెంప్ట్ చేస్తూ వచ్చారు.
ఫ్లాపులు వచ్చినా కూడా తన ప్రయత్నాలు తను చేయడం ఆపలేదు. కానీ ఇప్పుడు నాగ్ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తనకు వయసు మీద పడిందని, ఇంకా యాక్షన్ సీన్లు చేస్తూ వుంటే ఈ జనరేషన్ కుర్రకారు చూడరని క్లారిటీ వచ్చేసినట్లు కనిపిస్తోంది.
వైల్డ్ డాగ్ సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. దాంతో నాగ్ క్లారిటీ వచ్చేసింది. ఇకపై చేసే సినిమాల్లో యాక్షన్ సీన్లు ఎక్కువ వుండకుండా చూసుకోవాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నాగ్ ఓ సినిమాను ప్రవీణ సత్తారు డైరక్షన్ లో చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు అంటే యాక్షన్ సినిమానే చేస్తాడు. కానీ నాగ్ ఇప్పుడు యాక్షన్ ను తగ్గించి, ఫ్యామిలీ, రొమాంటిక్ సీన్లు పెంచేపనిలో ప్రవీణ్ సత్తారుతో కలిసి డిస్కషన్లు సాగించాడట. ఈ మేరకు స్క్రిప్ట్ ను కొత్తగా లాక్ చేసినట్లు తెలుస్తోంది.