మొహమాటానికి పోతున్న చైతూ

నాగ్ చైతన్య మంచోడు. ఏ ఇగోలు, శషభిషలు లేని యంగ్ హీరో. కానీ అదే అతనికి సమస్య అవుతోంది. ఏ నిర్మాతనూ కాదనలేకపోతున్నాడు. ఎవరు అడిగినా చేద్దాం అనే తప్ప, తరువాత చూద్దాం అనే…

నాగ్ చైతన్య మంచోడు. ఏ ఇగోలు, శషభిషలు లేని యంగ్ హీరో. కానీ అదే అతనికి సమస్య అవుతోంది. ఏ నిర్మాతనూ కాదనలేకపోతున్నాడు. ఎవరు అడిగినా చేద్దాం అనే తప్ప, తరువాత చూద్దాం అనే మాట రావడం లేదు.దాంతో ఎవరికి ఎప్పుడు చేస్తాడో అన్నది తెలియడం లేదు. 

దిల్ రాజుకు థాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి-సాహు గారపాటి సినిమా ఒకటి చేయాల్సి వుంది. మైత్రీలో ఓ సినిమ వుంటుందన్న టాక్ వుంది. సురేష్ బ్యానర్ లో ఓ సినిమా అని తరుణ్ భాస్కర్ డైరక్టర్ అని వార్తలు వున్నాయి. 

వెంకీ అట్లూరితో ఎడ్యుకేషనల్ బ్యాక్ డ్రాప్ మూవీ వుండనే వుంది. ఇవన్నీ కాక స్వంత బ్యానర్ బంగార్రాజులో చైతూనే చేసేలా నాగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇవన్నీ కాక మరొ ఒకటి రెండు ప్రాజెక్టులకు కూడా మాట ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఇవన్నీ దేని తరువాత ఏది మెటీరియలైజ్ అవుతోందో? తెలియదు. మొత్తానికి అక్కినేని యంగ్ హీరో కెరీర్ కాస్త కన్ప్యూజ్ గా వున్నా, లైనప్ మాత్రం కాస్త గట్టిగానే వుంది.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్