నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు బన్నీ. గ్యాప్ తీసుకోలేదు వచ్చిందంటూ దాన్ని కవర్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఈ డైలాగ్ అప్పటి కంటే ఇప్పుడు బన్నీకి సరిగ్గా సెట్ అవుతుంది. ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేయాలనుకున్న అల్లు అర్జున్ ప్లానింగ్ ను కరోనా దెబ్బకొట్టింది. సో.. ఈసారి బన్నీ గ్యాప్ తీసుకోనక్కర్లేదు, ఆటోమేటిగ్గా అదే వచ్చింది.
ఏడాది ప్రారంభంలో అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ చేశాడు అల్లు అర్జున్. సో.. ఈ ఏడాది బన్నీ నుంచి మరో సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతా భావించారు. బన్నీ కూడా అదే అనుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే పుష్ప సినిమాను ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తీసుకొద్దామని ప్లాన్ చేశాడు.
కానీ కరోనా కారణంగా ఈ సినిమా షెడ్యూల్ కాన్సిల్ అయింది. ఇంకా చెప్పాలంటే బన్నీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేకపోయాడు. నెక్ట్స్ షెడ్యూల్ ను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో అనుకున్నారు కానీ అంతలోనే కరోనా రావడం, ఎక్కడిపనులు అక్కడ ఆగిపోవడం జరిగిపోయాయి. దీంతో ఈ ఏడాది బన్నీ నుంచి మరో సినిమా రావడం అనుమానమే అంటున్నారు.
అసలే అక్కడున్నది సుకుమార్. సినిమాలు చెక్కడంలో స్పెషలిస్ట్. దానికితోడు బన్నీ కూడా కలిశాడు. ఇంకేముంది, వచ్చే నెలలో షూట్ ప్రారంభించినా ఈ ఏడాది సినిమా రావడం దాదాపు అసాధ్యం. నిజానికి మహేష్ విషయంలో కూడా ఈ “గ్యాప్” ప్రస్తావన వచ్చి ఉండేది. అతడి సినిమా కూడా ఏడాది ప్రారంభంలోనే రిలీజైంది. కాబట్టి ఇంకో సినిమాకు స్కోప్ ఉంది. కాకపోతే 3 నెలలు గ్యాప్ తీసుకుంటానని మహేష్ స్వయంగా ప్రకటించాడు కాబట్టి అతడి నుంచి ఈ ఏడాది మరో సినిమా ఆశించడం అత్యాశే అవుతుంది. కరోనా కారణంగా ఆ 3 నెలల గ్యాప్ కాస్తా 4-5 నెలలు అయ్యేలా ఉంది.