రవితేజ @ 17 కోట్లు

కరోనా వ్యవహారం అలాగే వుంది. థియేటర్లు తెరచుకోనే లేదు. రెడీ అయిన సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. కానీ హీరోలు మాత్రం పారితోషికాలు పెంచేస్తున్నారు.  Advertisement నాన్ థియేటర్ రైట్స్ అదనంగా రావడం అన్నది…

కరోనా వ్యవహారం అలాగే వుంది. థియేటర్లు తెరచుకోనే లేదు. రెడీ అయిన సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియదు. కానీ హీరోలు మాత్రం పారితోషికాలు పెంచేస్తున్నారు. 

నాన్ థియేటర్ రైట్స్ అదనంగా రావడం అన్నది నిర్మాతలకు కాస్త ఆనందం కలిగించింది. కానీ ఆ ఆనందం మిగలకుండా హీరోల రెమ్యూనిరేషన్లు పెరిగిపోతున్నాయి.

వరుణ్ తేజ్ 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతుంటే సీనియర్ హీరో రవితేజ 17 కోట్లు అడుగుతున్నారనే వార్తలు వినిపించడం ప్రారంభమైంది. 

రవితేజ చకచకా సినిమాలు అంగీకరిస్తున్నారు. క్రాక్ సినిమాతో మాంచి హిట్ కొట్టారు. రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా సగానికి పైగా పూర్తి కావచ్చింది. కొత్త డైరక్టర్ తో సినిమా ఓకె చేసారు. నక్కిన త్రినాధరావు సినిమా వుంది.

వీటి రెమ్యూనిరేషన్లు ఇంకా ఫిక్స్ కాలేదు. కొత్తగా ఎవరైనా అప్రోచ్ అయితే 17 కోట్లు అడుతున్నారన్న వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.