ఏపీలో మద్యపాన నిషేధం మీద విపక్షాలు ఘాటు వ్యాఖ్యలు ఎపుడూ చేస్తూనే ఉంటాయి. మాటకు వస్తే చాలు జగన్ మీద గన్ గురి పెడుతూనే ఉంటాయి.
నిజానికి టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారిన విషయాన్ని కూడా తమ్ముళ్లు చాలా కన్వీనియెంట్ గా మరచిపోతారు.
మరి వారి మాటలకు ధీటైన జవాబు ఇవ్వాలీ అంటే యువ మంత్రి గుడివాడ అమరనాధ్ మాత్రమే సరిపోతారేమో. ఆయన తాజాగా మాట్లాడుతూ ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం మీద తమ ఎన్నికల మ్యానిఫేస్టోలో ఎక్కడా పెట్టలేదని చెప్పి విపక్షాలకు షాక్ ఇచ్చారు. మేము అనని మాట చెప్పని దాన్ని మీరు ఎలా డిమాండ్ చేస్తారన్నది ఆయన వాదన.
ఏపీలో మద్యం ధరలు షాక్ కొట్టేలా చేయడమే తమ ప్రభుత్వం విధానం అని ప్రస్తుతం అది అమలు జరుగుతుతోందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలను ఫైవ్ స్టార్ ధరల స్థాయికి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
గతంలో తాము చెప్పినదే ఇపుడు చేస్తున్నామని విపక్షాలకు అర్ధం కాకపోతే తమ ఎన్నికల హామీలను చెక్ చేసుకోవచ్చునని గుడివాడ చెప్పుకొచ్చారు. దీని మీద విపక్షాలు ప్రత్యేకించి టీడీపీ తమ్ముళ్ళు ఏమంటారో.