మావోల్లారా….. మావైపు రావద్దు

మావోయిస్టులు అంటే ఒకనాడు ఏజెన్సీ ప్రాంతాలలో ఎంతో ఆదరణ. వారి వైపునే జనాలు ఉండేవారు. వారికి అంత పట్టు ఉండేది. అలాంటి మావోల ఉద్యమాలు కాలక్రమంలో తగ్గిపోయాయనే చెప్పాలి. దాంతో పాటు ఇపుడు ఏజెన్సీలో…

మావోయిస్టులు అంటే ఒకనాడు ఏజెన్సీ ప్రాంతాలలో ఎంతో ఆదరణ. వారి వైపునే జనాలు ఉండేవారు. వారికి అంత పట్టు ఉండేది. అలాంటి మావోల ఉద్యమాలు కాలక్రమంలో తగ్గిపోయాయనే చెప్పాలి. దాంతో పాటు ఇపుడు ఏజెన్సీలో కూడా రోడ్లు వేస్తున్నారు. మారుమూలకు కూడా కనెక్టివిటీ పెరిగింది. అభివృద్ధి జరుగుతోంది. దాంతో మావోయిస్టులు మునుపటి మాదిరిగా గిరిజన ప్రాంతాలకు పెద్దగా రాలేని పరిస్థీతి.

మరో వైపు పోలీసులు కూడా గిరిజనంలో చైతన్యం తీసుకురావడంతో పాటు వారిని మావోల వైపు మళ్ళకుండా చేసే ప్రయంతాలు విజయవంతం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో గతానికి భిన్నంగా మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడ పోస్టర్లు కూడా ఎక్కడబడితే అక్కడ వెలుస్తున్నాయి.

తాజాగా చూస్తే ఒక వైపు మావోయిస్త్టుల వారోత్సవాలు జరుగుతూంటే ఇంకో వైపు వారికి యాంటీగా పోస్టర్లు ఏజెన్సీలో పడడం సంచలనం రేపుతఒంది. ఉమ్మడి విశాఖ ఏజెన్సీ జిల్లాలోని కొయ్యూరు, మంప, బూదరాళ్ళ, రేవళ్ళ ప్రాంతాలలో అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు లేటెస్ట్ గా వెలిసాయి.

గిరిజనులకు ఉపయోగపడని మావోయిస్టుల వారోత్సవాలు వద్దు, అమాయక గిరిజనులను ఇంఫార్మర్స్ పేరుతో చంపుతున్నారు అని ఈ పోస్టర్లలో పేర్కొనడం విశేషం. సెల్ ఫోన్ టవర్లు పేల్చేసి గిరి యువత అభివృద్ధి ఫలాలు దూరం చేస్తున్నారు అని రాయడం బట్టి చూస్తే మావోలకు కాని కాలమేనా అనే సందేహాలు వస్తున్నాయి. మావోయిస్టులారా మా జోలికి రావద్దు అని కూడా పేర్కొన్నారు. ఇదిపుడు హాట్ టాపిక్ గా ఏజెన్సీలో జిల్లాలలో ఉంది.