బాలయ్య సినిమాకు ఫ్లాప్ సెంటిమెంట్

అనిల్ రావిపూడి…బాలయ్య కాంబినేషన్ కు స్టార్ కాస్ట్ వ్యవహారం మొదలయ్యింది. యాంటీ సెంటిమెంట్ అన్నట్లుగా ఫస్ట్ స్టెప్ వేసారు.  Advertisement గతంలో బాలయ్య ఫ్లాప్ సినిమా మిత్రుడులో నటించిన హీరోయిన్ ప్రియమణిని హీరోయిన్ గా…

అనిల్ రావిపూడి…బాలయ్య కాంబినేషన్ కు స్టార్ కాస్ట్ వ్యవహారం మొదలయ్యింది. యాంటీ సెంటిమెంట్ అన్నట్లుగా ఫస్ట్ స్టెప్ వేసారు. 

గతంలో బాలయ్య ఫ్లాప్ సినిమా మిత్రుడులో నటించిన హీరోయిన్ ప్రియమణిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు బోగట్టా. చాలా ఆప్షన్లు వున్నాయని యూనిట్ చెబుతున్నా, ప్రియమణినే పైనల్ చేసినట్లు బోగట్టా. 

బాలయ్యకు కానీ సీనియర్ హీరోలకు కానీ హీరోయిన్ దొరకడమే కష్టం. అందువల్ల ఫ్లాప్ హీరోయిన్ నా, హిట్ హీరోయిన్ నా అని చూడడానికి లేదు.

ప్రియమణి మంచి నటి..సీనియర్ అయినా యంగ్ లుక్స్ తో కనిపిస్తుంది ఇప్పటికీ. కానీ కెరీర్ లో హిట్ ల జాబితా చూసుకుంటే మాత్రం చాలా తక్కువ. పెళ్లయిన కొత్తలో… యమదొంగ తప్పితే మిగిలినవన్నీ అయితే యావరేజ్ లేదా ఫ్లాప్ సినిమాలే. సీనియర్ హీరో నాగ్ సరసన రెండు మూడు డిజాస్టర్లు నమోదు చేసి వున్నాయి.

ఆ విషయం ఎలా వున్నా బాలయ్య పక్కన పెయిర్ బాగుంటుందని అనిల్ రావిపూడి ఈ ఛాయిస్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. సినిమాలో హీరోయిన్ శ్రీలీల లాంటి హీరోయిన్ కు తల్లిగా కనిపించాలి. మామూలుగానే బాలయ్యకు హీరోయిన్లు దొరకడం కష్టం. ఇంక తల్లిపాత్ర అంటే మరీనూ. అందుకే ప్రియమణినే రైట్ చాయిస్ అనుకుని వుంటారు.