మోదీ పాచిక ఫెయిల్.. యోగిదే పవర్..

ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ కలవరం ముగిసింది. మోదీ వర్సెస్ యోగి అన్నట్టుగా సాగిన అంతర్గత పోరులో యోగిదే పైచేయి అని తేలింది. యూపీలో తన సన్నిహితుడు ఏకే శర్మను డిప్యూటీ సీఎంగా చేసి,…

ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ కలవరం ముగిసింది. మోదీ వర్సెస్ యోగి అన్నట్టుగా సాగిన అంతర్గత పోరులో యోగిదే పైచేయి అని తేలింది. యూపీలో తన సన్నిహితుడు ఏకే శర్మను డిప్యూటీ సీఎంగా చేసి, యోగికి చెక్ పెట్టాలని చూసిన మోదీ పాచిక ఫెయిలైంది. కనీసం యూపీ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేసేందుకు కూడా మోదీ-షా సాహసం చేయలేకపోయారు. ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్న యోగి తన పైచేయి నిలుపుకున్నారు.

యూపీలో యోగి సింగిల్ మ్యాన్ షో చూపిస్తున్నారు. భావి ప్రధానిగా ఆయనను అభిమానులు కీర్తిస్తున్నారు. అంటే పరోక్షంగా మోదీకి సెగ తగిలినట్టే. అందులోనూ మోదీ ఇలాంటి విషయాల్లో చాలా ముందు చూపుతో ఉంటారు. గురువుగారు గురువుగారు అంటూనే.. 2014లో అద్వానీకి చుక్కలు చూపించిన మోదీ.. తనకి పోటీగా తెరపైకి వస్తున్న యోగిని తొక్కేయాలని చూస్తున్నారు.

యూపీలో బీజేపీ పాలనపై వస్తున్న విమర్శలు, ఇటీవల స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం మోదీకి కలిసొచ్చాయి. దీంతో అక్కడ సీఎం యోగీని మార్చేయాలని ప్రణాళిక రచించారు. కుదరకపోతే కనీసం కేబినెట్ లో అయినా మార్పులు చేయాలని, తన మనిషి ఏకే శర్మను డిప్యూటీ సీఎం చేయాలని ఆలోచించారు. ఇటీవల ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి.

కానీ అంతలోనే అంతా తుస్సుమంది. ఏకే శర్మను ఆర్ఎస్ఎస్ బ్యాచ్ పక్కకు నెట్టేసింది, యోగికి లైన్ క్లియర్ చేసింది.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధాని అయిన తర్వాత కూడా మోదీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు ఐఏఎస్ ఆఫీసర్ ఏకే శర్మ. మూడేళ్ల పదవీకాలం ఉండగానే ఆయనకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించి యూపీలో ఎమ్మెల్సీగా చేశారు మోదీ. అంతేకాదు, యూపీ రాజకీయాల్లో యోగికి చెక్ పెట్టేందుకు ఆయన్ను ప్రోత్సహించారు.

డిప్యూటీ సీఎం అవుతాడనుకున్న ఆయన్ను ఆర్ఎస్ఎస్ బ్యాచ్ కాస్తా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించింది. ఇప్పుడు యూపీలో బీజేపీకి ఉన్న 17మంది ఉపాధ్యక్షుల్లో శర్మ కూడా ఒకరనమాట. దీంతో మోదీ రాజకీయాలకు కూడా పరోక్షంగా ఆర్ఎస్ఎస్ చెక్ పెట్టినట్టయింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మోది నీడ లేకుండా యోగి టీమ్ సొంతంగా రంగంలోకి దిగబోతోందనమాట.