వావ్..వరుణ్..రెమ్యూనిరేషన్

సినిమాలు, విడుదలలు ఎలా వున్నా, హీరోల రెమ్యూనిరేషన్లు మాత్రం అంతకు అంతకు పెరిగిపోతున్నాయి. టాప్ హీరోల రెమ్యూనిరేషన్లు యాభై కోట్లకు చేరిపోతే, మిడ్ రేంజ్ హీరోల రెమ్యూనిరేషన్లు పది కోట్లకు చేరుకున్నాయి. మెగా హీరో…

సినిమాలు, విడుదలలు ఎలా వున్నా, హీరోల రెమ్యూనిరేషన్లు మాత్రం అంతకు అంతకు పెరిగిపోతున్నాయి. టాప్ హీరోల రెమ్యూనిరేషన్లు యాభై కోట్లకు చేరిపోతే, మిడ్ రేంజ్ హీరోల రెమ్యూనిరేషన్లు పది కోట్లకు చేరుకున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఈ పది కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు.

ఎఫ్ 3 సినిమాకు ఎనిమిది కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకున్నారని టాక్ వుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఓకె చేసిన సినిమాకు పన్నెండు కోట్ల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. బోగవిల్లి ప్రసాద్ నిర్మించే సినిమాకు పన్నెండు కోట్లు రెమ్యనిరేషన్ అడిగారని, ఆఖరికి వేరే విధంగా ఫిక్స్ చేసారని వినిపిస్తోంది.

ఎనిమిది కోట్లు రెమ్యూనిరేషన్ ఇవ్వడానికి, లాభాల్లో నాగబాబుకు వాటా పెట్టడానికి డిస్కషన్లు జరుగుతున్నాయని బోగట్టా. ఇప్పటికే నాని రెమ్యూనిరేషన్ పది కోట్లకు చేరింది. శర్వానంద్, నితిన్ ఇంకా అంతవరకు చేరలేదు. 

చైతూ కూడా మరీ ఆ రేంజ్ లో డిమాండ్ చేయడం లేదు. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాలు ఏవీ ఇంకా మాటలే తప్ప అగ్రిమెంట్ చేయలేదు. రిపబ్లిక్ విడుదల తరువాత కానీ కొత్త రెమ్యూనిరేషన్ అన్నది డిసైడ్ కాకపోవచ్చు.

మొత్తానికి మిడ్ రేంజ్ హీరోల్లో వరుణ్ లీడ్ తీసుకున్నట్లు అయింది.