చంద్రబాబు తెలివిని మెచ్చుకున్న వైసీపీ మంత్రి

వైసీపీ నేతలెవరైనా చంద్రబాబును మెచ్చుకుంటారు. నిద్రలో కూడా బాబును మెచ్చుకోరు. అవకాశం దొరికితే రెండు తిట్లు తిట్టడానికి రెడీగా ఉంటారు. కానీ మంత్రి అనీల్ కుమార్ మాత్రం చంద్రబాబును మెచ్చుకున్నారు. బాబు తెలివితేటల్ని చూసి…

వైసీపీ నేతలెవరైనా చంద్రబాబును మెచ్చుకుంటారు. నిద్రలో కూడా బాబును మెచ్చుకోరు. అవకాశం దొరికితే రెండు తిట్లు తిట్టడానికి రెడీగా ఉంటారు. కానీ మంత్రి అనీల్ కుమార్ మాత్రం చంద్రబాబును మెచ్చుకున్నారు. బాబు తెలివితేటల్ని చూసి నేర్చుకోమని లోకేష్ కు సూచించారు.

“నారా చంద్రబాబుకు ప్రజలు తొక్కి నార తీశారు. ఇక ఏపీలో వచ్చేది లేదనే విషయం చంద్రబాబుకు తెలుసు. కుర్చీ దక్కదనే విషయం బాబుకు బాగా తెలుసు. అందుకే తెలివిగా హైదరాబాద్ లో ఇల్లు కట్టాడు. ముందస్తుగా మకాం మార్చి హైదరాబాద్ లో కూర్చున్నాడు.”

ఇలా బాబు తెలివితేటల్ని, లోకేష్ కు గుర్తుచేశారు మంత్రి అనీల్. ఇంట్లో ఏ మూల కూర్చోవాలో వెళ్లి చంద్రబాబను అడగమని లోకేష్ కు సూచించారు. హైదరాబాద్ కు మకాం మార్చిన తర్వాత ఏపీకి విజిటింగ్ గా వస్తున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.

“విజిటింగ్ లా హైదరాబాద్ నుంచి వచ్చి పోతున్నారు. మంచిదే. వచ్చామా.. మీటింగ్ కు వెళ్లామా.. పప్పు వేసుకొని తిన్నామా.. తిరిగి తెలంగాణకు వెళ్లిపోయామా అన్నట్టుండాలి. అంతేతప్ప, ఇక్కడకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిదే బాగుండదు. చిటికెలు వేసి వార్నింగ్ ఇస్తున్నావ్. నిజంగా అంత మగాడివే అయితే ఏపీలో ఏ పల్లెకైనా వచ్చి చిటికేసి, ఏ వైసీపీ కార్యకర్తనైనా టచ్ చేయి. అప్పుడు నీకు తెలుస్తుంది మగాడు ఎవరో.”

సింహానికి, గ్రామ సింహానికి తేడా ప్రజలకు తెలుసని.. సింహం ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డుపైకి రాదని, గ్రామ సింహం మాత్రం ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుందంటూ లోకేష్ కు చురకలంటించారు అనీల్ కుమార్.