అవసరాల..ప్లీజ్..కథ మార్చు

అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో ఏనాడో ప్రారంభమైన సినిమా ఒకటి వుంది. నాగశౌర్య హీరో. పీపుల్స్ మీడియా నిర్మాత. వడ్డీలు తడిసి మోపడవుతున్నాయి. అమెరికా వీసాలు రాక సినిమా ఆగిపోయింది. ఇప్పుడు దీని మీద…

అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో ఏనాడో ప్రారంభమైన సినిమా ఒకటి వుంది. నాగశౌర్య హీరో. పీపుల్స్ మీడియా నిర్మాత. వడ్డీలు తడిసి మోపడవుతున్నాయి. అమెరికా వీసాలు రాక సినిమా ఆగిపోయింది. ఇప్పుడు దీని మీద కరోనా భూతం వచ్చి పడింది. ఇక ఇప్పట్లో అమెరికా యాత్రలు వుండవు.

అయినా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కథ మార్చడం లేదు. ఓ క్రియేటర్ తలచుకుంటే, కథను అటు ఇటు మార్చి, నిర్మాతను గట్టున పడేయడం, సినిమాను ఫినిష్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ అవసరాల ఆ అవసరం లేదు అన్నట్లుగా వుండిపోయారు.

ఆయనకేం పోయింది? వడ్డీలు కట్టుకునేది నిర్మాత కదా? ప్రస్తుతం పీపుల్స్ మీడియా సంస్థ ఈ విషయం మీద ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.అవసరం అయితే కథను అమెరికా మీద నుంచి మళ్లించమని కోరనున్నట్లు తెలుస్తోంది. అలా అయితే తప్ప ఈ సినిమా బతికి బట్టకట్టదు. లేదా అంటే ఇప్పటి వరకు పెట్టిన కోట్లు అన్నీ కరోనా బారిన పడిపోతాయి.

ఎన్నికల కమిషనర్ ని అందుకే మార్చేసాం

ఏప్రిల్ 11 ఏపీలో కొత్త చరిత్ర మొదలైన రోజు