‘సర్’ టీజర్ వచ్చింది

ప్రయివేటు చదువు వెనుక చీకటి కోణాలెన్నో. చదుకోవడాన్ని చదువు కొనడంగా మార్చేసాయి ప్రయివేటు విద్యా సంస్థలు. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథతో తెరకెక్కుతున్న సినిమా ‘సర్’. తమిళ హీరో ధనుష్…

ప్రయివేటు చదువు వెనుక చీకటి కోణాలెన్నో. చదుకోవడాన్ని చదువు కొనడంగా మార్చేసాయి ప్రయివేటు విద్యా సంస్థలు. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథతో తెరకెక్కుతున్న సినిమా ‘సర్’. తమిళ హీరో ధనుష్ నటిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక. ధనుష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు.

ఈ టీజర్ లో థనుష్ జూనియర్ లెక్చరర్ బాల గంగాధర్ తిలక్ పాత్రలో కనిపించారు. విద్యాసంస్థల అధిపతికి, అదే సంస్థలో పని చేసే జూనియర్ లెక్చరర్ కు మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో సినిమా నడుస్తుందని టీజర్ చెబుతోంది. ప్రయివేటు విద్యలో జరిగే మోసాలు, పన్నే పన్నాగాలు, ఇవన్నీ కూడా సినిమాలో చోటు చేసుకుంటాయని అర్థం అవుతోంది. టీజర్ లో సంయుక్త మీనన్ జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ లా కనిపించింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిపి శ్రీకర స్టూడియోస్ (మైహొమ్), ఫార్ట్యూన్ ఫోర్ (త్రివిక్రమ్) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.