శర్వానంద్- సుధీర్ వర్మ కాంబినేషన్ లో తయారైన సినిమా ఒకటి వుంది. ఒకటి అని ఎందుకు అనడం అంటే నెలలు గడిచినా, షూటింగ్ పూర్తి అయి ఫస్ట్ కాపీ రెడీ అవుతున్నా, విడుదల ఈ నెలలోనే వున్నా కూడా ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. దళపతి టైటిల్ మీద నమ్మకం పెట్టుకోవడం, అది వేరేవాళ్లు పెట్టుకోవడంతో వచ్చింది సమస్య.
ఇప్పుడు ఇంతకీ ఈ సినిమా నెలాఖరున మే 31న విడుదల అవుతుందా? కాదా? అన్నది అనుమానంగా వుంది. ఎందుకంటే ఈ సినిమాకు రెండు విషయాలు ఫైనల్ కావాల్సి వుంది. ఒకటి టైటిల్. రెండు ఫైనల్ కట్. ఈ రెండూ జరగాలంటే హీరో శర్వానంద్ రావాలి.
శర్వానంద్ ఇప్పుడు విదేశాల్లో వున్నారు. 96 సినిమా రీమేక్ షూటింగ్ లో ఆయన బిజీగా వున్నారు. ఆయన కొద్దిరోజుల్లో రావాలి. టైటిల్ ఫైనల్ చేయాలి. సినిమా ఫైనల్ కట్ ఓకె అనాలి. అప్పుడు డేట్ ఫిక్స్ చేయడం, ప్రచారం స్టార్ట్ చేయడం. మొదలవుతాయి. ఆయన రావడం ఆలస్యం అయితే సినిమా జూన్ ఫస్ట్ వీక్ లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.