ఆసియన్… మహర్షి.. లక్షన్నర టికెట్లు

హైదరాబాద్ లోని ఆసియన్ గ్రూప్ లో వున్న మల్టీ స్క్రీన్లు, మల్టీ ఫ్లెక్స్ లు అన్నీ నిన్నటికి నిన్న మహర్షి బుకింగ్ స్టార్ట్ చేసాయి. మొత్తం ఫస్ట్ డే, కేవలం ట్విన్ సిటీస్ లో…

హైదరాబాద్ లోని ఆసియన్ గ్రూప్ లో వున్న మల్టీ స్క్రీన్లు, మల్టీ ఫ్లెక్స్ లు అన్నీ నిన్నటికి నిన్న మహర్షి బుకింగ్ స్టార్ట్ చేసాయి. మొత్తం ఫస్ట్ డే, కేవలం ట్విన్ సిటీస్ లో ఆసియన్ గ్రూప్ లో లక్షన్నర టికెట్ లు అమ్ముడవుతున్నాయని అంచనా. అది కూడా టికెట్ రేటు కాస్త పెంచారు కూడా. ఈ లెక్కన నైజాంలో మహర్షి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం వుంది.

ఇంకా పివీఆర్, ఐనాక్స్ బుకింగ్ లు ఓపెన్ కాలేదు. సింగిల్ థియేటర్లు ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. అదికాక నైజాంలో మిగిలిన ఏరియాల్లో వున్న సింగిల్ థియేటర్ల బుకింగ్ స్టార్ట్ కాలేదు. ఇవన్నీ కలిస్తే తొలిరోజు ఎన్ని లక్షల టికెట్ ల కింద వస్తుందో చూడాలి.

నైజాంలో ఒక్క ఆసియన్ సంస్థనే దాదాపు 110 స్క్రీన్లలో మహర్షిని విడుదల చేస్తోంది. ప్రెస్టీజియస్ ఏఎమ్ బి మాల్ లో తొలిరోజు దాదాపు ఇరవైకి పైగా షోలు పెడితే అన్నీ ఫుల్ అయిపోయాయి. ఈ లెక్కన చూస్తుంటే మహర్షి తొలిరోజు ఫిగర్లు మామూలుగా వుండేలా లేవు

పరిటాల వారసుడి గెలుపుపై నమ్మకం లేదా?