ఆలా అంటే ఇదేంటీ.. ఇప్పటికే మహర్షిలో మూడు బ్యానర్లు వున్నాయి. ఇది నాలుగో బ్యానర్ నా అనుకోవచ్చు. అంతే కాదు. యువి కూడా కూడా వుంది అంటే ఇంకా ఆశ్చర్యం కలగవచ్చు. కానీ నిజం. అయితే నిర్మాణంలో కాదు. పంపిణీలో. మహర్షి సినిమా కృష్ణాజిల్లా పంపిణీ బాధ్యత దిల్ రాజు/యువి/గీతా సిండికేట్ తీసుకుంది. ఈ జిల్లాలో ఈ ముగ్గరు కలిసి పంపిణీ వ్యాపారం నిర్వహిస్తారు. సమాన వాటాలు వేసుకుని వ్యాపారం చేస్తారు.
మహర్షి సినిమాను కృష్ణా ఆరు కోట్లు కింద అంచనా వేసినట్లు తెలుస్తోంది. అంటే గీతా రెండు కోట్లు, యువి రెండు కోట్లు, దిల్ రాజు రెండు కోట్లు అన్నమాట. వచ్చిన లాభం సమానంగా పంచుకుంటారు. ఆ విధంగా మహేష్ సినిమా వెనుక బన్నీ, ప్రభాస్ సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి.