ఛీ.. ఛీ.. సింహం పరువు తీసిన లోకేష్

నారా లోకేష్ కర్నూలు ఓవర్ యాక్షన్ పై వైసీపీ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు, లోకేష్ కి చాకిరేవు పెడితే, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్…

నారా లోకేష్ కర్నూలు ఓవర్ యాక్షన్ పై వైసీపీ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు, లోకేష్ కి చాకిరేవు పెడితే, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో చినబాబుని ఏకిపారేశారు. కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా అని ప్రశ్నించారు. సింహంతో పోల్చుకుని లోకేష్ మృగరాజు పరువు తీసేశారని సెటైర్ వేశారు.

ప్రతి ఒక్కడూ తనకి తానే సింహంతో పోల్చుకుని తెగ చించేసుకుంటున్నాడని, సింహం అనే మృగరాజుకి గౌరవం లేకుండా పోయిందని అన్నారు. “మంగళగిరిలో గోచీ ఊడి బతుకు జీవుడా అని బయటపడ్డ మాలోకం కూడా సింహమేనంట!, ఆ లక్షణాలు ఒక్కటన్నా నీలో ఉన్నాయో లేవో చూసుకో చిట్టీ” అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

“మనిషి జన్మ ఎత్తి ఇంత నికృష్టంగా ఆలోచిస్తారా అని, బాబు లోకేష్ లను చూస్తే అనిపిస్తుంది. అభివృద్ధి జరగొద్దు, సంక్షేమ పథకాలను అడ్డుకోవాలి, ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దు, కరోనా విజృంభించి రాష్ట్రం వల్లకాడైపోతే బాగుండని కలలు కనేవారిని ఏమనాలి” అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

లోకేష్ శరీరానికి, మైండ్ కు మధ్య భౌతిక దూరం

కరోనా కాలంలో మనుషుల మధ్య భౌతిక దూరం పాటించాలనే నియమం ఉందని, కానీ లోకేష్ తన మైండ్ కి తన శరీరానికి మధ్య గ్యాప్ మెయింటెన్ చేస్తున్నారని చెణుకులు విసిరారు విజయసాయి.

స్క్రిప్ట్ రైటర్లు రాసిచ్చిన రెండు సినిమా డైలాగులు చెబితే మాస్ లీడర్ అయిపోతావా? అని ప్రశ్నించారు. “కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా? పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ అయ్యా కొడుకులు ఇంట్లో కూర్చుని చిటికెలేసుకోండి” అంటూ ఎద్దేవా చేశారు.