‘జై పవన్’ అని చంద్రబాబు అంటున్నట్టేనా?

ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోయాయి… తమ మధ్య గల ప్రేమానుబంధానికి ఇన్నాళ్లుగా కప్పిఉంచిన ముసుగును తొలగించేయాల్సిన సమయం వచ్చింది. అందుకే కాబోలు.. నెమ్మదిగా పవన్ కల్యాణ్ ను ప్రసన్నం చేసుకునే దిశగా చంద్రబాబు కొన్నిమాటలు…

ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోయాయి… తమ మధ్య గల ప్రేమానుబంధానికి ఇన్నాళ్లుగా కప్పిఉంచిన ముసుగును తొలగించేయాల్సిన సమయం వచ్చింది. అందుకే కాబోలు.. నెమ్మదిగా పవన్ కల్యాణ్ ను ప్రసన్నం చేసుకునే దిశగా చంద్రబాబు కొన్నిమాటలు వదులుతున్నట్లుగా కనిపిస్తోంది. తాను సొంతంగా అధికారపీఠం మీదికి వచ్చే అవకాశం ఎటూలేదని తేలిపోయిన తర్వాత… అంతోఇంతో పవన్ కు రాగల సీట్లను ఆసరాగా చేసుకుని గద్దె ఎక్కడానికి పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇంగ్లిషు టీవీ ఛానెల్ వారు నిర్వహించిన సదస్సులు చంద్రబాబునాయుడు శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా సంకీర్ణ ప్రభుత్వాలకు ఆయన  జైకొట్టారు. ‘సంకీర్ణ ప్రభుత్వాలన్నీ చాలా చక్కగా పరిపాలించాయి. గత ఎన్నికల్లో ఒక పార్టీకి మెజారిటీ ఇస్తే ఏం ఒరిగింది’ అంటూ ఆయన ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను చంద్రబాబునాయుడు కేంద్రప్రభుత్వానికి సంబంధించి మాత్రమే చేసిఉండవచ్చు. కానీ, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఆయన అలాంటి సంకీర్ణాల కోసం ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారని అనిపిస్తోంది. ఉభయతారకంగా ఉపయోగపడేవిధంగానే ఆయన ఈ మాటలన్నారని ప్రజలు అనుకుంటున్నారు.

చంద్రబాబునాయుడు ప్రస్తుతం.. రాష్ట్రంలో ఓటమి తప్పదనే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టుగా తానే చాటుకుంటున్నారు. పదేపదే ఎన్నికల అక్రమాల గురించి చెప్పడం.. వైకాపా మీద నిందలు వేయడం ద్వారా… చంద్రబాబులోని ఓటమి భయం వ్యక్తం అవుతోంది. కాగా, ఇప్పుడు తాను గెలిచే పరిస్థితి లేదు గానీ.. కనీసం పవన్ కల్యాణ్ కు దక్కగల సీట్లయినా ఆసరాగా చేసుకుని అధికారంలోకి రావాలని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది.

ఎటూ జగన్ ను దెబ్బకొట్టడానికి చంద్రబాబు ప్రయోగించిన పావుగా బరిలోకి దిగిన పవన్.. అందుకు సిద్ధంగానే ఉండవచ్చు. అయితే.. ఆయనకు రాగల సీట్లు ఎన్ని? ఏ సర్వేలైనా సరే.. 3-4కు మించి సీట్లు రావని అంచనా వేస్తున్నాయి. మరి ఆ బలంతో.. చంద్రబాబు గద్దె ఎక్కడం సాధ్యమేనా అని పలువురు అనుకుంటున్నారు. అయినా.. చంద్రబాబు మాటల్లో ఒక నిజం ఉంది. గత ఎన్నికల్లో సింగిల్ పార్టీకి అధికారం కట్టబెడితే ఏం ఒరిగింది? అని ఆయన కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. అది ఏపీ విషయంలో కూడా నిజం.

తెలుగుదేశానికి అధికారం కట్టబెడితే.. ప్రజలకు ఏం ఒరిగింది? మాయమాటలు తప్ప!!

పరిటాల వారసుడి గెలుపుపై నమ్మకం లేదా?