ఆంధ్రోళ్లను ప్రమాదంలోకి నెడుతున్న చంద్రబాబు!

చంద్రబాబునాయుడు తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం.. ప్రజలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడం లేదా అనిపిస్తోంది. హైదరాబాదులో బతుకుతున్న తెలుగువాళ్లను ఆయన ఇప్పుడు తన స్వార్థానికి వాడుకుంటున్నారు. వారి మీద, తెలంగాణ వాసుల్లో…

చంద్రబాబునాయుడు తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం.. ప్రజలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడం లేదా అనిపిస్తోంది. హైదరాబాదులో బతుకుతున్న తెలుగువాళ్లను ఆయన ఇప్పుడు తన స్వార్థానికి వాడుకుంటున్నారు. వారి మీద, తెలంగాణ వాసుల్లో ద్వేషాన్ని రగిలించి కుట్రలు చేస్తున్నారు. ఆ రకంగా తెలంగాణలో జీవిస్తున్న ఆంధ్రోళ్లను అస్థిరతకు గురిచేసేలా వక్రవ్యూహాలు పన్నుతున్నారు.

తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాదులో ఆంధ్రోళ్ల పరిస్థితి కొన్నాళ్ల కిందటి వరకు కాస్త డోలాయమానంగా ఉండేది. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత… చాలామంది ఆంధ్రోళ్లు హైదరాబాదు విడిచి తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. హైదరాబాదులో జీవనం దుర్లభం అనుకున్నారు. కానీ, వారి భయాలు నిజంకాదని కాలక్రమంలో తేలిపోయింది. సీమాంధ్ర, తెలంగాణ అనే వ్యత్యాసాలు లేకుండా… అక్కడి జనజీవనం సామరస్య వాతావరణంలో సాగుతూనే వచ్చింది.

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలో.. ఎన్ని రకాలుగా సీమాంధ్రుల్ని మాటలు అన్నప్పటికీ.. అవన్నీ ఉద్యమఆవేశంలో అన్నవే తప్ప… వారి మీద ద్వేషంతో కాదని.. తెలంగాణలో బతుకుతున్న వారంతా సమానమేనని… అందరినీ తమ వారిగానే చూసుకుంటాం అని.. తొలిసారిగా గద్దెఎక్కిన తెరాస పాలకులు చెప్పుకుంటూనే వచ్చారు.

2019 ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్, చంద్రబాబును తూలనాడారే తప్ప.. ఆంధ్ర ప్రజలని మాటలనలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో కేసీఆర్ మీద ద్వేషాన్ని వెదజల్లి తన రాజకీయ ప్రయోజనం సాధించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి… పార్టీ సమీక్షలు చేస్తున్న సమయంలో.. హైదరాబాదులో ఉన్న తెలుగోళ్లంతా కేసీఆర్ ను ద్వేషించడానికి అదేపనిగా తరలివచ్చి ఏపీలో ఓట్లు వేశారంటూ కొత్త పాట ఎత్తుకుంటున్నారు.

హైదరాబాదు మాత్రమేకాదు.. ఏ ఇతర ప్రాంతాల్లో బతుకుతున్న వారైనా.. ఎన్నికల సమయంలో తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్లి.. ఓట్లు వేస్తారు. అయితే హైదరాబాదులో ఉన్న తెలుగోళ్లంతా చంద్రభక్తులు అన్నట్లుగా ఆయన బిల్డప్ ఇస్తున్నారు. ఇలాంటా వక్రవ్యూహాలను ప్రయోగించినందుకు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తెలుగుదేశానికి తెలంగాణ వ్యాప్తంగా దారుణమైన పరాభవం జరిగినప్పటికీ.. చంద్రబాబుకు బుద్ధి వచ్చినట్లుగా లేదు.

హైదరాబాదులో సెటిలర్లు మెజారిటీ ఉన్న ప్రాంతాలలో కూడా తెదేపా దారుణంగా ఓడిపోయింది. అయినా.. ఇప్పటికీ.. చంద్రబాబు అక్కడి ఆంధ్రోళ్లపై కక్ష కట్టినట్టుగా.. వారి మీద తెలంగాణ ప్రజల్లో అపనమ్మకం కలిగించేలా ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలు చేయడం హేయమని పలువురు భావిస్తున్నారు.

పరిటాల వారసుడి గెలుపుపై నమ్మకం లేదా?